పోలమాంబ ఆలయంలో చోరీ
మన్యం జిల్లా పాలకొండ పట్టణంలోని పురటాల పోలమాంబ ఆలయంలో చోరీ జరిగింది.
theft


పాలకొండ, 04 అక్టోబర్ (హి.స.)

మన్యం జిల్లా పాలకొండ పట్టణంలోని పురటాల పోలమాంబ ఆలయంలో చోరీ జరిగింది. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత తూర్పు ద్వారాన్ని పగలగొట్టి ఆలయంలోకి ప్రవేశించిన దుండగులు.. ప్రధాన హుండీలోని నగదును ఎత్తుకెళ్లారు.

ఆదివారం ఉదయం ఆలయానికి వచ్చిన ప్రధానార్చకులు రవిబాబు తలుపులు తెరిచి ఉండటాన్నిగమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై డోల వెంకన్న క్లూస్ టీం ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు.

ఆలయంలో సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో సమీప ప్రాంతాల్లో సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande