పోలవరం పనుల్లో వేగం.. వర్షాల నేపథ్యంలో ECRF డ్యామ్పై ప్రత్యేక జాగ్రత్తలు
ఆంధ్రప్రదేశ్లో అత్యంత కీలకమైన పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై మరోసారి అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇటీవలి వర్షాల నేపథ్యంలో డ్యామ్ నిర్మాణంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని పోలవరం ప్రాజెక్టు అథారిటీ CEO సంజీవ్ వోహ్రా అధికారులను ఆదేశించారు.
Ap govt


అమరావతి , 04 అక్టోబర్ (హి.స.)ఆంధ్రప్రదేశ్లో అత్యంత కీలకమైన పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై మరోసారి అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇటీవలి వర్షాల నేపథ్యంలో డ్యామ్ నిర్మాణంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని పోలవరం ప్రాజెక్టు అథారిటీ CEO సంజీవ్ వోహ్రా అధికారులను ఆదేశించారు.

ప్రాజెక్టు ప్రాంతంలో ఇటీవల వర్షాలు కురిసిన నేపథ్యంలో ECRF డ్యామ్లో జరుగుతున్న పనులను ఆయన పరిశీలించారు. ముఖ్యంగా Gaps-1, Gaps-2, G-Hill ప్రాంతాల్లో రాళ్లు, మట్టి, ఇసుకతో జరుగుతున్న పనుల పురోగతిని సమీక్షించారు. వర్షాల ప్రభావం వల్ల నిర్మాణ పదార్థాల బలంపై ఎలాంటి ప్రతికూల ప్రభావం పడకుండా నిరంతరం రోలర్లతో కాంపాక్షన్ చేయాలని సూచించారు.

పోలవరం ప్రాజెక్టును నిర్ణీత గడువులో పూర్తి చేయడానికి కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం సమన్వయంతో పనిచేస్తున్నాయని PPA అధికారులు చెబుతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాజెక్టు పురోగతిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారని PPA CEO తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande