
హైదరాబాద్ , 04 అక్టోబర్ (హి.స.)తెలంగాణలో బాలల రక్షణకు సంబంధించిన మరో ఆందోళనకర అంశం వెలుగులోకి వచ్చింది. లైంగిక వేధింపులకు గురైన సుమారు 450 మంది బాలబాలికలు పాఠశాల విద్యకు దూరమైన్నారు.
ఈ పరిస్థితిని మార్చేందుకు మహిళా భద్రతా విభాగం, విద్యాశాఖ కలిసి చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నాయి. బాలలపై లైంగిక నేరాల ప్రభావం సంఘటన జరిగిన రోజుతో ముగియదు. బాధితుల్లో భయం, అవమాన భావన, సామాజిక ఒత్తిడి, పాఠశాలకు వెళ్లడానికి నిరాకరణ వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కుటుంబం, పాఠశాల, పోలీస్ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ నుంచి సరైన మద్దతు లభించకపోతే పిల్లలు విద్యను పూర్తిగా వదిలివేసే ప్రమాదం ఉంటుంది. ఈ నేపథ్యంలో బాధిత పిల్లలను తిరిగి పాఠశాలకు తీసుకురావడానికి ప్రత్యేక సహాయక వ్యవస్థ అవసరమని అధికారులు గుర్తించారు.
కౌన్సెలింగ్, కుటుంబానికి అవగాహన, పాఠశాలలో సురక్షిత వాతావరణం, అవసరమైనప్పుడు న్యాయ సహాయం వంటి అంశాలు ఇందులో కీలకం కావచ్చు. పిల్లల భద్రత కేవలం నేరాన్ని అరికట్టడంతో ముగియకుండా, నేరం తర్వాత వారి జీవితాన్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడం కూడా ప్రభుత్వ బాధ్యతగా మారుతోంది. ఈ అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన చైల్డ్ ఆన్లైన్ సేఫ్టీ ఫ్రేమ్వర్క్తో కలిపి చూస్తే, తెలంగాణ ప్రభుత్వం బాలల భద్రతను భౌతిక ప్రపంచంతో పాటు డిజిటల్ ప్రపంచంలోనూ ప్రధాన అంశంగా తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్