
హైదరాబాద్, 04 అక్టోబర్ (హి.స.)
మోడీ మూడు సార్లు పీఎం కావడం తట్టుకోలేక కాంగ్రెస్ పార్టీ ఈసీపై విమర్శలు చేస్తోందని తెలంగాణ బీజేపీ స్టేట్ చీఫ్ రామచందర్ రావు విమర్శించారు.
నెహ్రూ కుటుంబం నుంచి ఇక ఈ దేశానికి ప్రధాన మంత్రి కారు అనే భయంతో ప్రజలను తప్పుదారి పట్టిస్తోందన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికలన్నీ చట్టవిరుద్ధమేనని, లోక్ సభ, అసెంబ్లీలను రద్దు చేసి బ్యాలెట్ తో మళ్లీ ఎన్నికలు జరపాలన్న ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలపై ఆదివారం రామచందర్ రావు స్పందించారు.
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. కాంగ్రెస్ మాటలు ప్రజాస్వామ్యాన్ని, భారతీయ ఓటర్లను అవమానించడమేనన్నారు.
తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియ తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులే చేస్తారని అభ్యంతరం ఉన్న ఓటర్ల విషయంలో ఫారమ్ -7 సమర్పిస్తే వాటిపై ఈసీ విచారణ చేసి చర్యలు తీసుకుంటుందన్నారు.
ఫారమ్-7 ఇచ్చినంత మాత్రాన ఓటు తొలగించడం కాదన్నారు. ఈ ఫారమ్-7 లు బీజేపీ బీఎల్ఎలు ఎవరూ ఇవ్వలేదని స్పష్టం చేశారు. ఫారమ్ సమర్పించినంత మాత్రాన ఓట్లు తొలగిస్తున్నారనే వాదన చేయడం సరికాదన్నారు. ఎన్నికల్లో ఓడిపోయిన చోట్ల మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఎస్ఐఆర్, ఈవీఎంలపై మాట్లాడుతోందన్నారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు