పేదల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం.....మంత్రి పొంగులేటి
రాష్ట్రంలోని పేదల సంక్షేమమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం పని చేస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.
Minister


ఖమ్మం, 04 అక్టోబర్ (హి.స.) రాష్ట్రంలోని పేదల సంక్షేమమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం పని చేస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.

ఖమ్మంలోని తన క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఏదులాపురం మున్సిపాలిటీ, ఖమ్మం రూరల్ మండలానికి చెందిన లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) చెక్కులను మంత్రి పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ కార్పొరేట్, ప్రైవేట్ ఆసుపత్రుల్లో అత్యవసర వైద్య చికిత్స పొందిన పేదలు, మధ్యతరగతి ప్రజలకు సీఎంఆర్ఎఫ్ ఎంతో ఉపయోగ పడుతుందన్నారు.

తమది ప్రజా ప్రభుత్వమని, గత పాలకుల కంటే రెండు మూడు రెట్లు ప్రజలకు లబ్ధి కలిగేలా సంక్షేమ పథకాలను అందిస్తున్నామని మంత్రి పొంగులేటి వివరించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande