ఓటు అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు.. తలసాని శ్రీనివాస్ యాదవ్
ఎన్నికల కమిషన్ నిర్ణయాలు ఓటర్ల హక్కుకు భంగం కలిగించేలా ఉన్నాయని మాజీమంత్రి, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
Mla


హైదరాబాద్, 04 అక్టోబర్ (హి.స.)

ఎన్నికల కమిషన్ నిర్ణయాలు ఓటర్ల హక్కుకు భంగం కలిగించేలా ఉన్నాయని మాజీమంత్రి, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.

సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని పద్మారావు నగర్లో ఆదివారం ఏర్పాటు చేసిన గ్రాడ్యుయేట్ ఓటరు నమోదు కార్యక్రమంలో తలసాని పాల్గొని మాట్లాడారు.

ఓటు అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు ఓటరు జాబితా ప్రత్యేక సవరణ లో ఎన్నికల కమిషన్ బాధ్యతగా వ్యవహరించలేదని ఆయన విమర్శించారు.

బీఎల్వోలను కార్యక్రమంపై సరైన అవగాహన లేని వారిని నియమించారు. అనేక చోట్ల గందరగోళం నెలకొని లక్షల మంది ఓట్లు తొలగించబడ్డాయని తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు.

గ్రాడ్యుయేట్ ఎన్నికలు జరిగిన ప్రతిసారి ఓటరు నమోదు ఎందుకని, దానిని కొత్త ఓటర్ల వరకే పరిమితం చేయాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే సూచించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande