
గుంటూరు , 04 అక్టోబర్ (హి.స.)ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరిపాలనా దక్షతను, రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన చేస్తున్న కృషిని శివరాజ్ సింగ్ చౌహాన్ కొనియాడారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు ఒక విజన్ ఉన్న నాయకుడు అని అన్నారు.
ఈ పుణ్యభూమికి నా కోటి కోటి ప్రణామాలు. తెనాలి అంటే ప్రతిభకు మారుపేరు, తేనె కంటే తీయనైనది తెలుగు భాష. ఏపీ దేశానికే దిక్సూచిగా మారబోతోంది అని కేంద్ర గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు.
గుంటూరు జిల్లా బుర్రిపాలెంలో 3 లక్షల ఇళ్ల నిర్మాణాలు, 3డీ కాంక్రీట్ ప్రింటింగ్ పైలట్ ప్రాజెక్ట్ శంకుస్థాపన అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.
తాను కేవలం మధ్యప్రదేశ్కే కాకుండా, ఆప్యాయత పంచే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా 'మావయ్య'నే అని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అపారమైన విజన్ ఉన్న నాయకుడని, ఆయన నేడు ఆలోచించేది రేపు దేశం ఆచరిస్తుందని కొనియాడారు.
ఏఐ డేటా సెంటర్లు, క్వాంటమ్ టెక్నాలజీ వంటి ఆలోచనలే అందుకు నిదర్శనమన్నారు. రాజధాని అమరావతిని చూసి తాను అబ్బురపడ్డానని, చంద్రబాబు అభివృద్ధి ప్రణాళికలతో అమరావతి ప్రపంచంలోనే ఒక ఐకాన్గా మారబోతోందని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కలిసి రాష్ట్రం కోసం ఎంతో కష్టపడుతున్నారని చెప్పారు.
గతంలో జగన్ ప్రభుత్వం పేదల సొంతింటి కలను చెరిపేసిందని, ఆ విధ్వంసాన్ని ప్రజలందరూ గమనించారని తీవ్రంగా విమర్శించారు. పేదల సొంతింటి కలను మళ్లీ నెరవేర్చడమే చంద్రబాబు సంకల్పమని శివరాజ్ సింగ్ చౌహాన్ స్పష్టం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV