రాజమండ్రికి భారీ నిధులు :మంత్రి నారాయణ
రాజమండ్రిలో గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తామని మంత్రి నారాయణ తెలిపారు. దీనికోసం రూ.2,000 కోట్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు.
మంత్రి నారాయణ


నెల్లూరు, 04 అక్టోబర్ (హి.స.)రాజమండ్రిలో గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తామని మంత్రి నారాయణ తెలిపారు. దీనికోసం రూ.2,000 కోట్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు.

పుష్కరాల ఏర్పాట్లు, మౌలిక వసతుల కోసం రాజమండ్రికి రూ.1,000 కోట్ల నిధులు కేటాయించారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో గతంలో నిలిచిపోయిన అభివృద్ధి ప్రాజెక్టులన్నింటినీ తిరిగి ప్రారంభిస్తామని స్పష్టం చేశారు.

నెల్లూరు నగరంలో రూ.2.8 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు మంత్రి నారాయణ శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా పుష్కరాల పనులపై మంత్రి నారాయణ కీలక ప్రకటన చేశారు.రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రతికూలంగా ఉన్నప్పటికీ పుష్కరాలను వైభవంగా నిర్వహించేందుకు వెనుకాడబోమని మంత్రి నారాయణ స్పష్టం చేశారు.

రాజమండ్రిలో పుష్కరాల అభివృద్ధి పనుల కోసం రూ.1,000 కోట్లు మంజూరు చేశామని.. పుష్కరాలకు సంబంధించిన వివిధ పనులకు మొత్తం సుమారు రూ.2,000 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. కేంద్ర నిధులతో గతంలో నిలిచిపోయిన ప్రాజెక్టులను తిరిగి ప్రారంభిస్తామని పేర్కొన్నారు. ‘జల్ జీవన్ మిషన్’ కింద కేంద్రం గతంలో రూ.5,350 కోట్లు మంజూరు చేసినప్పటికీ, 2019 ఫిబ్రవరిలో ఆ నిధులను వినియోగించలేదని మంత్రి ఆరోపించారు.

ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికలపై మాట్లాడుతూ, స్థానిక సంస్థల ఎన్నికలు ఖచ్చితంగా జరుగుతాయని స్పష్టం చేశారు. 16వ ఆర్థిక సంఘం కింద రాష్ట్రానికి రూ.12 వేల కోట్ల నిధులు మంజూరయ్యాయని, స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగకపోతే ఈ నిధులు వచ్చే అవకాశం ఉండదని తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande