ఎస్ఐర్ ప్రక్రియను పకడ్బందీగా పూర్తి చేయాలి..ఎలక్టోరల్ రోల్ అబ్జర్వర్
రాష్ట్రంలో జరుగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియను పూర్తి పారదర్శకతతో, నిబంధనల మేరకు పకడ్బందీగా నిర్వహించాలని ఎలక్టోరల్ రోల్ అబ్జర్వర్ బాల మాయాదేవి అధికారులను ఆదేశించారు.
Collector


జగిత్యాల, 06 అక్టోబర్ (హి.స.) రాష్ట్రంలో జరుగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియను పూర్తి పారదర్శకతతో, నిబంధనల మేరకు పకడ్బందీగా నిర్వహించాలని ఎలక్టోరల్ రోల్ అబ్జర్వర్ బాల మాయాదేవి అధికారులను ఆదేశించారు.

అర్హత కలిగిన ప్రతి ఓటరు పేరు ఓటర్ల జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవాలని, అనర్హుల పేర్ల తొలగింపులో చట్టబద్ధమైన విధానాలను తప్పనిసరిగా పాటించాలని ఆమె సూచించారు.

మంగళవారం జగిత్యాల జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో ఈఆర్వోలు, ఏఈఆర్వోలతో ఎస్ఐర్ ప్రక్రియపై జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్లో కలిసి ఆమె సమీక్ష నిర్వహించారు. ఎస్ఐఆర్పై ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని, హెల్ప్ డెస్క్ వద్దకు వచ్చే ఓటర్లకు దరఖాస్తుల విధానం, అవసరమైన పత్రాలు, నోటీసుల వివరాలను స్పష్టంగా తెలియజేసి సందేహాలను నివృత్తి చేయాలని తెలిపారు. జనసంచారం అధికంగా ఉండే ప్రాంతాల్లో ప్రజలకు సులభంగా అర్థమయ్యేలా పోస్టర్లు ఏర్పాటు చేసి అవగాహన కల్పించాలని ఆదేశించారు.

ఎస్ఐఆర్ ప్రక్రియలో ఇప్పటివరకు సుమారు 70 శాతం పనులు పూర్తయ్యాయని అభినందించిన బాల మాయాదేవి, మిగిలిన 30 శాతం పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande