ప్రివిలేజ్ ఫీ వల్ల తాగేవారికే కొంత భారం, బార్లకు కాదు: జూపల్లి కృష్ణారావు
ప్రివిలేజ్ ట్యాక్స్ రద్దు చేయాలంటూ చేపట్టిన నిరసనలపై ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందించారు.
Minister


హైదరాబాద్, 06 అక్టోబర్ (హి.స.)

ప్రివిలేజ్ ట్యాక్స్ రద్దు చేయాలంటూ తెలంగాణ బార్ అండ్ రెస్టారెంట్స్ అసోసియేషన్ చేపట్టిన నిరసనలపై ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందించారు.

ఈ పన్ను వల్ల బార్ల యాజమాన్యాలకు ఎలాంటి నష్టం ఉండదని, కేవలం మద్యం తాగే వారిపై మాత్రమే స్వల్ప భారం పడుతుందని ఆయన స్పష్టం చేశారు.

ఇవాళ మీడియాతో అయిన మాట్లాడారు. హైదరాబాద్ సీటీని అప్ గ్రేడ్ చేశామని అందుకు అనుగుణంగానే బార్ లైసెన్స్ లు ఇచ్చామన్నారు. ఇతర రాష్ట్రాలలో ఉన్న విధంగానే బార్ లకు పర్మిషన్ ఇచ్చినట్లు వెల్లడించారు. మద్యం తాగడం తగ్గాలని గతంలో రేట్లు పెంచాం... అయినా పెద్దగా మార్పేమి లేదన్నారు. బీఆర్ఎస్ హాయాంలొ 260 శాతం మద్యం అమ్మకాలు పెరిగాయని కేసీఆర్ హాయాంలొ మద్యం ఆదాయం రూ.10 వేల కోట్ల నుంచి రూ.36 వేల కోట్లకు పెరిగిందన్నారు. ప్రస్తుతం రూ.40 వేల కోట్ల ఆదాయం వస్తోందని మేము వచ్చాక రూ.4వేల కోట్ల ఆదాయం పెరిగిందన్నారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande