అధికార బీజేపీకి అనుబంధ సంస్థలా కేంద్ర ఎన్నికల సంఘం.. మంత్రి పొన్నం
కేంద్ర ఎన్నికల సంఘం.. అధికార బీజేపీకి అనుబంధ సంస్థలా మారిపోయిందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Minister


హైదరాబాద్, 06 అక్టోబర్ (హి.స.)

కేంద్ర ఎన్నికల సంఘం.. అధికార బీజేపీకి అనుబంధ సంస్థలా మారిపోయిందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

మంగళవారం కోహెడ మండలంలో 'పల్లె పల్లెకు పొన్నం అన్న' కార్యక్రమంలో భాగంగా మంత్రి పొన్నం పర్యటించారు. ఈ సందర్భంగా వారు ప్రజల నుంచి వినతులు స్వీకరించి సమస్యల పరిష్కారానికి అధికారులను ఆదేశించారు.

పరివేద గ్రామ అభివృద్ధికి అదనంగా రూ. 10 లక్షలు కేటాయిస్తామని ప్రకటించారు. గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తయితే పరివేదలోని 965 ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. అనంతరం నకిరికొమ్ముల గ్రామంలో పత్రికా సమావేశం ఏర్పాటు చేసి మంత్రి మాట్లాడుతూ గతంలో ఒక్క అర్హులైన ఓటరు కూడా లిస్టు నుంచి గల్లంతు కాకూడదనే ఉద్దేశంతో సవరణలు జరిగేవని, కానీ ప్రస్తుతం కమిషన్ అధికారులు భయంతో, బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా ఉన్న పేదల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగిస్తున్నారని మండిపడ్డారు.

కర్ణాటక, బీహార్, బెంగాల్ సహా పలు రాష్ట్రాల్లో ఎన్నికలకు ముందే గెలుపు కోసం ఇలాంటి కుట్రలకు తెరలేపారని ఆరోపించారు. కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ ఒక రాజకీయ పార్టీకి అధికార ప్రతినిధిలా వ్యవహరిస్తున్నారని, ఆయన వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande