ఢిల్లీకి పయణమైన సీఎం రేవంత్ రెడ్డి - జాతీయ రాజకీయాలు మరియు పెండింగ్ ప్రాజెక్టులపై చర్చ
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఇవాళ ప్రత్యేక విమానంలో దేశ రాజధాని ఢిల్లీకి పయణమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక ప్రాజెక్టుల అనుమతులు, కేంద్రం నుంచి రావాల్సిన నిధుల విడుదల తదితర అంశాలపై కేంద్ర మంత్రులను కలవడమే కాకుండా, పలు జాతీయ రాజక
CM Revanth Reddy


హైదరాబాద్ , 07 అక్టోబర్ (హి.స.)తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఇవాళ ప్రత్యేక విమానంలో దేశ రాజధాని ఢిల్లీకి పయణమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక ప్రాజెక్టుల అనుమతులు, కేంద్రం నుంచి రావాల్సిన నిధుల విడుదల తదితర అంశాలపై కేంద్ర మంత్రులను కలవడమే కాకుండా, పలు జాతీయ రాజకీయ పరిణామాలపై చర్చించేందుకు ఈ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా మూసీ నది పునరుజ్జీవనం, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం మరియు రాష్ట్ర విభజనకు సంబంధించిన పెండింగ్ అంశాలపై కేంద్ర పెద్దలతో సీఎం చర్చించనున్నట్లు తెలుస్తోంది.

అలాగే, ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పిలుపు మేరకు జరుగుతున్న వివిధ కార్యక్రమాలలో ఆయన పాల్గొననున్నారు. పార్టీ జాతీయ నాయకులతో సమావేశమై రాష్ట్రంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహం, పార్టీ సంస్థాగత బలోపేతంపై చర్చలు జరపనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ప్రభుత్వ పనితీరు, సంక్షేమ పథకాల అమలు తీరును అధిష్టానానికి వివరించడంతో పాటు, రాష్ట్రానికి రావాల్సిన నిధుల సాధనలో కేంద్రంపై ఒత్తిడి తెచ్చే ప్రణాళికలపై సీఎం ఢిల్లీ పర్యటనలో మంత్రులు, అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande