
హైదరాబాద్ , 07 అక్టోబర్ (హి.స.)హైదరాబాద్ నగర KBR పార్క్ చుట్టూ పెరుగుతున్న వాహన రద్దీ, ఫ్లైఓవర్లు–అండర్పాస్ల ప్రతిపాదనలు, H-CITI మౌలిక వసతుల పునఃపరిశీలన నేపథ్యంలో ట్రాఫిక్ నిర్వహణలో మార్పులు తీసుకురావాలని అధికారులు ప్రయత్నిస్తున్నారు.
తాజా సమాచారం ప్రకారం ట్రాఫిక్ అధికారులు వన్వే ట్రయల్ను పరిశీలిస్తున్నారు. హైదరాబాద్లో KBR పార్క్ ప్రాంతం అత్యంత రద్దీగా ఉండే జంక్షన్లకు సమీపంలో ఉంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిల్మ్నగర్, పంజాగుట్ట తదితర ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలు ఈ మార్గాల మీదుగా ప్రయాణిస్తాయి.
ఉదయం, సాయంత్రం పీక్ అవర్స్లో వాహనాల సంఖ్య పెరగడంతో ట్రాఫిక్ ప్రవాహం మందగిస్తుంది. ఒకే సమయంలో వాహనాలు అన్ని దిశల నుంచి మలుపులు తీసుకోవడం వల్ల రద్దీ మరింత పెరుగుతుంది.
ఈ నేపథ్యంలో వన్వే వ్యవస్థ ద్వారా వాహనాల ప్రవాహాన్ని ఒక నిర్దిష్ట దిశలో నియంత్రించడం, సిగ్నళ్ల వద్ద వేచి ఉండే సమయాన్ని తగ్గించడం, కీలక కూడళ్లలో ట్రాఫిక్ ప్రవాహాన్ని సులభతరం చేయడం లక్ష్యంగా కనిపిస్తోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్