ఫ్యూచర్సిటీ పోలీస్ కమిషనరేట్ పునర్వ్యవస్థీకరణ - కొత్తగా పోలీస్స్టేషన్ల ఏర్పాటు
రాష్ట్రంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నూతన పారిశ్రామిక, సాంకేతిక కేంద్రమైన 'ఫ్యూచర్సిటీ' ప్రాంతంలో శాంతిభద్రతలను మరింత పటిష్టం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Telangana police


హైదరాబాద్ , 07 అక్టోబర్ (హి.స.)రాష్ట్రంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నూతన పారిశ్రామిక, సాంకేతిక కేంద్రమైన 'ఫ్యూచర్సిటీ' ప్రాంతంలో శాంతిభద్రతలను మరింత పటిష్టం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఫ్యూచర్సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిని పూర్తిగా పునర్వ్యవస్థీకరిస్తూ హోంశాఖ ప్రత్యేక జీవోను జారీ చేసింది. పెరుగుతున్న జనాభా, వాణిజ్య కార్యకలాపాలు మరియు ఐటీ సంస్థల విస్తరణను దృష్టిలో ఉంచుకుని ఈ సరికొత్త పోలీస్ బ్లూప్రింట్ను సిద్ధం చేశారు.

ఈ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఫ్యూచర్సిటీ కమిషనరేట్ పరిధిలో అత్యాధునిక పోలీస్స్టేషన్లను, 3 కొత్త శాంతిభద్రతల (Law & Order) డివిజన్లను మరియు ప్రత్యేక ట్రాఫిక్ జోన్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కొత్త పోలీస్ స్టేషన్ల ఏర్పాటు ద్వారా ఆ ప్రాంతంలో రాత్రి సమయాల్లో గస్తీ ముమ్మరం కావడంతో పాటు, ఎమర్జెన్సీ స్పందన వేగవంతం కానుంది. ఫ్యూచర్సిటీలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే అంతర్జాతీయ కంపెనీలు, విదేశీ ప్రతినిధులు మరియు స్థానిక ప్రజలకు పూర్తి స్థాయి రక్షణ కల్పించేలా పోలీస్ యంత్రాంగాన్ని సిద్ధం చేస్తున్నారు. ఈ కమిషనరేట్కు త్వరలోనే పూర్తి స్థాయి ఉన్నతాధికారులను కేటాయించి, సేవలను మరింత విస్తృతం చేయనున్నట్లు పోలీసు శాఖ వెల్లడించింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande