ఇంద్రకీలాద్రిపై ప్రధాని మోదీ పేరిట ప్రత్యేక పూజలు మరియు అర్చన
దేశ ప్రధాని నరేంద్ర మోదీ 25 ఏళ్ల విజయవంతమైన పరిపాలనా ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా విజయవాడలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మ సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Vijayawada temple


అమరావతి , 07 అక్టోబర్ (హి.స.)దేశ ప్రధాని నరేంద్ర మోదీ 25 ఏళ్ల విజయవంతమైన పరిపాలనా ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా విజయవాడలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మ సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రత్యేక ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం అత్యంత భక్తిశ్రద్ధలతో జరిగింది. ఎంపీ లింగమనేని రమేశ్ అమ్మవారి ఆలయానికి విచ్చేసి ప్రధాని మోదీ పేరిట ప్రత్యేకంగా 'ఖడ్గమాల అర్చన' జరిపించారు.

దేశం సుభిక్షంగా ఉండాలని, ప్రధాని మోదీకి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని అమ్మవారిని వేడుకుంటూ ఈ పూజలు నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. పూజా కార్యక్రమాల అనంతరం వేదపండితులు అందించిన అమ్మవారి తీర్థప్రసాదాలు, ప్రత్యేక శేషవస్త్రాలను ప్రధాని నరేంద్ర మోదీకి ప్రత్యేకంగా పంపుతున్నట్లు ఎంపీ వెల్లడించారు. దేశ ప్రజల సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తున్న నాయకుడికి దైవానుగ్రహం ఉండాలని ఆకాంక్షిస్తూ నిర్వహించిన ఈ వేడుకకు స్థానిక భక్తులు కూడా పెద్దఎత్తున హాజరయ్యారు. అమ్మవారి కృపతో దేశం మరింత ముందుకు సాగుతుందని ఈ సందర్భంగా నాయకులు విశ్వాసం వ్యక్తం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande