బీజేపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా 'సేవ జ్యోతి యాత్ర' ప్రారంభం UPDATE
కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం మరియు ప్రధాని నరేంద్ర మోదీ ప్రజాసేవను ప్రజల్లోకి తీసుకుపోయే ఉద్దేశంతో బీజేపీ అధివర్యం చేపట్టిన 'సేవ సంకల్ప్ అభియాన్' కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో 'సేవ జ్యోతి యాత్ర' ఘనంగా ప్రారంభమైంది.
Bjp


అమరావతి , 07 అక్టోబర్ (హి.స.)కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం మరియు ప్రధాని నరేంద్ర మోదీ ప్రజాసేవను ప్రజల్లోకి తీసుకుపోయే ఉద్దేశంతో బీజేపీ అధివర్యం చేపట్టిన 'సేవ సంకల్ప్ అభియాన్' కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో 'సేవ జ్యోతి యాత్ర' ఘనంగా ప్రారంభమైంది. రాష్ట్రంలోని ప్రతి జిల్లా కేంద్రంలోనూ, ప్రధాన నియోజకవర్గాల్లోనూ బీజేపీ శ్రేణులు, నాయకులు ఈ యాత్రను ఉత్సాహంగా ప్రారంభించారు. సమాజంలో వెనుకబడిన వర్గాలకు అండగా నిలవడమే ఈ యాత్ర ప్రధాన ఉద్దేశమని పార్టీ రాష్ట్ర నాయకులు తెలిపారు.

ఈ యాత్రలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాలలో స్వచ్ఛంద రక్తదాన శిబిరాలు, ఉచిత వైద్య శిబిరాలు మరియు యువతలో నైపుణ్యాభివృద్ధిని పెంపొందించే ప్రత్యేక అవగాహన సదస్సులను నిర్వహిస్తున్నారు. పేద విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్ పంపిణీ చేయడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తున్నారు. మోదీ నాయకత్వంలోని పరిపాలన అందించిన సంక్షేమ ఫలాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లడంలో ఈ సేవ జ్యోతి యాత్ర ఎంతగానో ఉపయోగపడుతుందని బీజేపీ శ్రేణులు పేర్కొంటున్నాయి. ప్రజల నుంచి కూడా ఈ యాత్రకు విశేష స్పందన లభిస్తోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande