
మార్కాపురం, 07 అక్టోబర్ (హి.స.)వన్యప్రాణి వారోత్సవాల సందర్భంగా ఈ రోజు బుధవారం ఉదయం మార్కాపురంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో 2కే రన్ ను ఘనంగా నిర్వహించారు.
మార్కాపురం అటవీ శాఖ కార్యాలయం వద్ద జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత, ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి 2కే రన్ను ప్రారంభించారు.వన్యప్రాణుల సంరక్షణ, అడవుల పరిరక్షణపై ప్రజలు, యువతలో అవగాహన కల్పించడమే లక్ష్యంగా 2కే రన్ నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.
ఈ సందర్భంగా డిప్యూటీ రేంజర్ కిరణ్ మాట్లాడుతూ, విద్యార్థులకు అడవులు, వన్యప్రాణుల ప్రాధాన్యత, జీవవైవిధ్య పరిరక్షణ, వన్యప్రాణుల సంరక్షణపై అవగాహన కల్పించారు. అటవీ సంపదను కాపాడటంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని ఆయన సూచించారు. అడవులపై ఆధారపడి జీవించే వన్యప్రాణుల సంరక్షణతో పర్యావరణ సమతుల్యతను కాపాడవచ్చని తెలిపారు. విద్యార్థులు ప్రకృతి, అడవులు, వన్యప్రాణుల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV