కాశీకి చేరుకున్న సేవా సంకల్ప్ యాత్ర...2,500 కి.మీ.. 25 మంది యువతతో సేవా సంకల్పం
టీడీపీ అనుబంధ సంస్థలైన టీఎన్ఎస్ఎఫ్, తెలుగు యువత ఆధ్వర్యంలో సేవా సంకల్ప యాత్ర వారణాసికి చేరుకుంది.
tnsf-and-telugu-yuvatha-seva-sankalpa-yatra-reaches-kashi-


వారణాసి, 07 అక్టోబర్ (హి.స.)

ప్రధాని నరేంద్ర మోదీ ప్రజా జీవితంలో 25 ఏళ్ల ప్రస్థానాన్ని పురస్కరించుకుని టీడీపీ అనుబంధ సంస్థలైన టీఎన్ఎస్ఎఫ్, తెలుగు యువత ఆధ్వర్యంలో సేవా సంకల్ప యాత్ర వారణాసికి చేరుకుంది.

తిరుపతి నుంచి వారణాసి వరకు సుమారు 2,500 కిలోమీటర్ల మేర 25 మంది యువత బైక్ యాత్ర చేపట్టారు. తిరుపతి అలిపిరి గరుడ సర్కిల్ వద్ద టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, తిరుపతి టీడీపీ ఇన్చార్జ్ జేబీ శ్రీనివాసులు, ఇతర కూటమి నాయకులు పాల్గొని యాత్రను గత నేల 30 తేదిన ప్రారంభించారు.మోడీ నాయకత్వానికి 25ఏళ్లు పూర్తైన సందర్భంగా తెలుగు యువత, తెలుగునాడు స్టూడెంట్స్ ఫెడరేషన్ (టీఎన్ఎస్ఎఫ్) ఆధ్వర్యంలో చేపట్టిన సేవా సంకల్ప్ బైక్ యాత్ర వారణాసికి చేరుకుంది. ఈ యాత్రను రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఛైర్మన్ రవినాయుడు, టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు, వీఎంఆర్డీఏ ఛైర్మన్ ప్రణవ్ గోపాల్ ఆధ్వర్యంలో 25 మంది బైకర్లతో తిరుపతిలో ప్రారంభించగా ఐదు రాష్ట్రాల మీదుగా ఏడురోజుల పాటు సాగింది.

యాత్రలో భాగంగా మార్గమధ్యంలో పలు ప్రముఖ ఆలయాలను దర్శించనున్నట్లు ప్రణవ్ గోపాల్ తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్ల ప్రస్థానం సందర్భంగా ఈ సేవా సంకల్ప యాత్ర చేపట్టినట్లు పేర్కొన్నారు. దేశ అభివృద్ధి, సుపరిపాలన, ఆర్థిక ప్రగతి, మౌలిక వసతుల విస్తరణలో ప్రధాని చేస్తున్న కృషి కొనసాగాలని ఆకాంక్షించారు.

వీరు మొత్తం 2వేల కిలోమీటర్లు ప్రయాణించి పవిత్రమైన కృష్ణా, గోదావరి నదుల నుండి సేకరించి జలాలతో కాశీకి చేరుకున్నారు. బైకర్లకు వారణాసిలో ఎంపీలు సానా సతీష్ బాబు, చింతకాయల విజయ్, యూపీ మంత్రి రవీంద్ర జైస్వాల్ స్వాగతం పలికారు. అనంతరం ఆయలంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande