సచివాలయంలో ప్రారంభంమైనా ఏపీ కేబినెట్ భేటీ UPDATE
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కాసేపటి క్రితం ప్రారంభం కాగా.. రాష్ట్రంలో మారుతున్న తాజా రాజకీయ, సామాజిక సమీకరణాల నేపథ్యంలో జరుగుతున్న ఈ భేటీపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
గిరిజన ప్రాంత విద్యార్థులకు జాతీయ స్థాయి పోటీ పరీక్షలైన ఐఐటీ-జేఈఈ (IIT-JEE), నీట్ (NEET) ప్రవేశ పరీక్షలకు నాణ్యమైన ఉచిత శిక్షణ అందించేందుకు ప్రత్యేకంగా 'సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్' ఏర్పాటుపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ యాక్ట్-1982 సవరణ ప్రతిపాదన తో పాటు, రాష్ట్రంలోకి అంతర్జాతీయ విద్యా సంస్థలను ఆకర్షించేందుకు ప్రతిష్టాత్మక 'విదేశీ ఉన్నత విద్యా సంస్థల క్యాంపస్లకు ఏపీ పాలసీ-2026'ను తీసుకురానున్నారు. ప్రముఖ విదేశీ, ప్రైవేటు విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు అవసరమైన అర్హతలు, ప్రత్యేక రాయితీలు మరియు ప్రోత్సాహకాలపై రూపొందించిన ఈ సరికొత్త విధానం ద్వారా ఆంధ్రప్రదేశ్ను గ్లోబల్ ఎడ్యుకేషన్ హబ్గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.

అమరావతి, 07 అక్టోబర్ (హి.స.) ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కాసేపటి క్రితం ప్రారంభం కాగా.. రాష్ట్రంలో మారుతున్న తాజా రాజకీయ, సామాజిక సమీకరణాల నేపథ్యంలో జరుగుతున్న ఈ భేటీపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పదికి పైగా కీలక అంశాలపై కేబినెట్ సమగ్రంగా చర్చిస్తున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో విశేష సేవలందిస్తున్న ఆశా వర్కర్ల సంక్షేమానికి సంబంధించి ప్రభుత్వం కీలక ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. విధి నిర్వహణలో లేదా సర్వీసులో ఉండగా ఆశా వర్కర్లు మృతి చెందితే వారికి గ్రాట్యుటీ చెల్లించే అంశంపై చర్చించారు.

సర్వీసులోని ప్రతి ఏడాదికి రూ.5 వేల చొప్పున గరిష్ఠంగా రూ.1.50 లక్షల వరకు గ్రాట్యుటీ అందించేలా ప్రతిపాదన సిద్ధం చేశారు. అలాగే రైతాంగానికి డిజిటల్ సేవలు విస్తరించే క్రమంలో 'హార్టికల్చర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్' ప్రాజెక్టుకు రూ.20.62 కోట్ల నిధుల కేటాయింపు, బాపట్ల జిల్లా పరిధిలోని రేపల్లె 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్సీ)ను 100 పడకల ఏరియా ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేసే అంశాలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో విద్యార్థుల డైట్ చార్జీల పెంపునకు సంబంధించిన నిర్ణయానికి మంత్రివర్గం రాటిఫికేషన్ ఇవ్వనుంది.

గిరిజన ప్రాంత విద్యార్థులకు జాతీయ స్థాయి పోటీ పరీక్షలైన ఐఐటీ-జేఈఈ (IIT-JEE), నీట్ (NEET) ప్రవేశ పరీక్షలకు నాణ్యమైన ఉచిత శిక్షణ అందించేందుకు ప్రత్యేకంగా 'సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్' ఏర్పాటుపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ యాక్ట్-1982 సవరణ ప్రతిపాదన తో పాటు, రాష్ట్రంలోకి అంతర్జాతీయ విద్యా సంస్థలను ఆకర్షించేందుకు ప్రతిష్టాత్మక 'విదేశీ ఉన్నత విద్యా సంస్థల క్యాంపస్లకు ఏపీ పాలసీ-2026'ను తీసుకురానున్నారు. ప్రముఖ విదేశీ, ప్రైవేటు విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు అవసరమైన అర్హతలు, ప్రత్యేక రాయితీలు మరియు ప్రోత్సాహకాలపై రూపొందించిన ఈ సరికొత్త విధానం ద్వారా ఆంధ్రప్రదేశ్ను గ్లోబల్ ఎడ్యుకేషన్ హబ్గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV

 rajesh pande