
నిజామాబాద్ , 13 నవంబర్ (హి.స.)నిజామాబాద్ జిల్లాలోని డిచ్పల్లి తెలంగాణ యూనివర్సిటీలో విద్యార్థుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. యూనివర్సిటీ ఓల్డ్ బాయ్స్ హాస్టల్లో అర్ధరాత్రి జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. ఓ సీనియర్ విద్యార్థి, బయటి వ్యక్తులను హాస్టల్కు పిలిపించి జూనియర్ విద్యార్థిపై దాడి చేయించినట్లు సమాచారం.
వివరాల ప్రకారం.. సీనియర్, జూనియర్ విద్యార్థుల మధ్య గత కొంతకాలంగా వివాదం కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సదరు సీనియర్ విద్యార్థి బయటి నుంచి ఐదుగురిని హాస్టల్కు రప్పించినట్లు సమాచారం. అనంతరం వారితో కలిసి జూనియర్ విద్యార్థిపై దాడి చేయించినట్లు తెలుస్తోంది. ఈ దాడిలో జూనియర్ విద్యార్థి తలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో తోటి విద్యార్థులు వెంటనే స్పందించి బాధితుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
మరోవైపు ఈ ఘర్షణకు సంబంధించిన దృశ్యాలు హాస్టల్లోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియోలు ఘటనకు సంబంధించిన ఆధారాలుగా మారాయి. యూనివర్సిటీ హాస్టల్లోకి బయటి వ్యక్తులు ఎలా ప్రవేశించారనే అంశంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. విద్యార్థుల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఘటనపై యూనివర్సిటీ అధికారులు, పోలీసులు విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్