హైదరాబాద్లో ఏఆర్ రెహమాన్ సంగీత కచేరీ.. తేదీ ఖరారు
సంగీత ప్రియులకు ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ అదిరిపోయే వినోదాన్ని అందించనున్నారు. ఆస్కార్, గ్రామీ వంటి ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ పురస్కారాలను అందుకున్న ఆయన హైదరాబాద్లో ప్రత్యేక సంగీత ప్రదర్శన ఇవ్వనున్నారు.
AR Rahman


హైదరాబాద్ , 14 నవంబర్ (హి.స.)

సంగీత ప్రియులకు ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ అదిరిపోయే వినోదాన్ని అందించనున్నారు. ఆస్కార్, గ్రామీ వంటి ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ పురస్కారాలను అందుకున్న ఆయన హైదరాబాద్లో ప్రత్యేక సంగీత ప్రదర్శన ఇవ్వనున్నారు. తన ‘వండర్మెంట్ టూర్’లో భాగంగా నగరంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 2027 జనవరి 31న గచ్చిబౌలి స్టేడియం ఈ సంగీత వేడుకకు వేదిక కానుంది.

నోయిజ్ ఎంటర్టైన్మెంట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగనుంది. రెహమాన్ తన అద్భుతమైన సంగీతంతో ప్రేక్షకులను మరోసారి మంత్రముగ్ధులను చేయనున్నారు. ఈ ప్రదర్శనలో లైవ్ ఆర్కెస్ట్రా ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఆయన స్వరపరిచిన ప్రముఖ పాటలతో పాటు ప్రత్యేక సంగీత ప్రదర్శనలు కూడా ఉండనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.

భారతీయ సంగీతాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన రెహమాన్ ప్రత్యక్ష ప్రదర్శనను వీక్షించేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ఆయన పాటలను లైవ్ ఆర్కెస్ట్రాతో వినే అవకాశం సంగీతాభిమానులకు ప్రత్యేక అనుభూతిని అందించనుంది. ఈ కార్యక్రమంతో హైదరాబాద్లో మరో భారీ సంగీత వేడుకకు రంగం సిద్ధమవుతోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande