మురసు తుపాను నష్టం రూ.2,484 కోట్లు.. కేంద్ర బృందానికి వివరించిన అధికారులు
ఆంధ్రప్రదేశ్లో మురసు తుపాను కారణంగా జరిగిన నష్టంపై కేంద్ర బృందం సమీక్ష నిర్వహించింది. రాష్ట్ర విపత్తు నిర్వహణ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ చిత్తరంజన్ దాస్ నేతృత్వంలోని బృందం హాజరైంది.
Cyclone Murasu


అమరావతి , 13 నవంబర్ (హి.స.)

ఆంధ్రప్రదేశ్లో మురసు తుపాను కారణంగా జరిగిన నష్టంపై కేంద్ర బృందం సమీక్ష నిర్వహించింది. రాష్ట్ర విపత్తు నిర్వహణ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ చిత్తరంజన్ దాస్ నేతృత్వంలోని బృందం హాజరైంది. తుపాను ప్రభావంతో రాష్ట్రంలో వివిధ రంగాలకు జరిగిన నష్టాన్ని అధికారులు కేంద్ర బృందానికి వివరించారు. ప్రాథమిక అంచనాల ప్రకారం మొత్తం రూ.2,484.43 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు వెల్లడించారు.

తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వం చేపట్టిన సహాయక, పునరుద్ధరణ చర్యలను కేంద్ర బృందం ప్రశంసించింది. ముఖ్యంగా తుపాను అనంతరం కేవలం రెండు రోజుల్లోనే విద్యుత్ సరఫరా, మొబైల్ నెట్వర్క్, రహదారుల వ్యవస్థను తిరిగి అందుబాటులోకి తీసుకురావడంపై అభినందనలు తెలిపింది. సహాయక చర్యల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు అందించిన సేవలను కూడా ప్రత్యేకంగా ప్రస్తావించింది.

అధికారుల వివరాల ప్రకారం తుపాను కారణంగా 1.43 లక్షల హెక్టార్లలో సాధారణ పంటలు, 6,756 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. అలాగే 3,859 ఇళ్లు, 1,385 కిలోమీటర్ల మేర రహదారులు ధ్వంసమయ్యాయి. వివిధ ప్రభుత్వ శాఖలకు జరిగిన నష్టంతో పాటు, తుపానును ఎదుర్కొనేందుకు ముందస్తుగా చేపట్టిన చర్యలను కూడా కేంద్ర బృందానికి వివరించారు. ఈ నష్టంపై కేంద్ర బృందం క్షేత్రస్థాయి పరిస్థితులను కూడా పరిశీలించనుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande