ఢిల్లీ ఎయిమ్స్ అరుదైన ఘనత: గర్భంలోని 25 వారాల పిండానికి భారత్లోనే తొలిసారి వెన్నెముక శస్త్రచికిత్స
ఢిల్లీ ఎయిమ్స్ అరుదైన ఘనత: గర్భంలోని 25 వారాల పిండానికి భారత్లోనే తొలిసారి వెన్నెముక శస్త్రచికిత్స
aims


న్యూఢిల్లీ, 14 నవంబర్ (హి.స.)

భారత

వైద్య చరిత్రలో న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది.

గర్భంలో ఉన్న 25 వారాల శిశువుకు

పుట్టుకతో వచ్చే తీవ్రమైన వెన్నెముక లోపాన్ని (మైలోమెనింగోసెల్ - Myelomeningocele) సరిచేయడానికి

దేశంలోనే మొట్టమొదటిసారిగా ఓపెన్ ఫీటల్ సర్జరీని వైద్యులు విజయవంతంగా

నిర్వహించారు.పిండం వెన్నెముక

దిగువ భాగంలో ఏర్పడిన రంధ్రం ద్వారా సెరెబ్రోస్పైనల్ ద్రవం బయటకు లీక్ అవుతుండటంతో, గురువారం ఎయిమ్స్ న్యూరోసైన్సెస్ సెంటర్‌లో

ఆరు గంటల పాటు శ్రమించి ఈ అరుదైన శస్త్రచికిత్సను పూర్తి చేశారు.

ఈ

సంక్లిష్ట ఆపరేషన్ కోసం ఐదు వారాలకు పైగా ముందస్తు కసరత్తు జరిగింది.ప్రసూతి, గైనకాలజీ, మాతృ-పిండ వైద్యం, న్యూరోసర్జరీ, అనస్థీషియా, ప్లాస్టిక్ సర్జరీ, రేడియాలజీ, నియోనాటాలజీ విభాగాలకు చెందిన 30 మందికి పైగా వైద్యులు, నర్సింగ్ సిబ్బంది ఇందులో

పాలుపంచుకున్నారు.ప్రొఫెసర్ దీపక్ గుప్తా

న్యూరోసర్జికల్ బృందానికి నాయకత్వం వహించగా,

ప్రొఫెసర్

నీనా మల్హోత్రా, ప్రొఫెసర్ కె.అపర్ణ శర్మ మాతృ-పిండ సంరక్షణ బాధ్యతలను

పర్యవేక్షించారు.హై-రిజల్యూషన్

మైక్రోస్కోపీ, నిరంతర అల్ట్రాసౌండ్

పర్యవేక్షణ సహాయంతో ఈ శస్త్రచికిత్సను అత్యంత కచ్చితత్వంతో నిర్వహించారు.

వెన్నెముకలో

ఏర్పడే తీవ్రమైన లోపం వల్ల శిశువులకు పక్షవాతం,

మెదడులో

ద్రవం చేరడం వంటి జీవితకాల నాడీ సంబంధిత సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుంది.పుట్టకముందే గర్భంలో శస్త్రచికిత్స

చేయడం వల్ల భవిష్యత్తులో మెదడు నుంచి ద్రవాన్ని తొలగించే షంట్ అవసరాన్ని గణనీయంగా

తగ్గించవచ్చని, శిశువు చలన సామర్థ్యం

మెరుగుపడుతుందని వైద్య నిపుణులు తెలిపారు.అయితే

ఇది పూర్తిస్థాయి నివారణ కాదని, బిడ్డ పుట్టిన తర్వాత

కూడా దీర్ఘకాలిక వైద్య పర్యవేక్షణ అవసరమని ప్రొఫెసర్ దీపక్ గుప్తా స్పష్టం చేశారు.

అమెరికా

వంటి దేశాల్లో రూ.కోటికి పైగా ఖర్చయ్యే

ఈ అత్యంత ఖరీదైన వైద్య చికిత్సను, కేంద్ర ప్రభుత్వ 'జనని శిశు సురక్ష కార్యక్రమం' (JSSK) కింద బాధిత కుటుంబానికి ఎయిమ్స్

పూర్తిగా ఉచితంగా అందించింది.గర్భధారణకు ముందే

మహిళలు ఫోలిక్ యాసిడ్ తీసుకోవడం ద్వారా ఇటువంటి న్యూరల్ ట్యూబ్ లోపాలను ముందే

నివారించవచ్చని వైద్య బృందం సూచించింది.ప్రస్తుతం

తల్లి, గర్భంలోని శిశువు

క్షేమంగా ఉన్నారని, ప్రసవం వరకు ప్రత్యేక

వైద్య బృందం నిరంతరం పర్యవేక్షిస్తుందని ఎయిమ్స్ వెల్లడించింది.

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande