36 గంటల అనంతరం పునరుద్ధరించబడిన మైక్రోసాఫ్ట్ సేవలు
దాదాపు 36 గంటల పాటు ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోయిన మైక్రోసాఫ్ట్ సేవలు చివరకు పునరుద్ధరించబడ్డాయి.
Microsoft


హైదరాబాద్, 14 నవంబర్ (హి.స.)

దాదాపు 36 గంటల పాటు ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోయిన మైక్రోసాఫ్ట్ సేవలు చివరకు పునరుద్ధరించబడ్డాయి.

ఔట్లుక్, టీమ్స్, మైక్రోసాఫ్ట్ 365, కోపైలట్ లాంటి ముఖ్యమైన సేవలన్నీ తిరిగి పనిచేస్తున్నాయని, సాంకేతిక లోపాన్ని పూర్తిగా సరిచేశామని సంస్థ ప్రకటించింది. దీంతో రెండు రోజులుగా ఇబ్బంది పడిన వినియోగదారులకు కాస్త ఊరట కలిగింది. 70కి పైగా దేశాల్లో ఈ అంతరాయం కనిపించింది.

ముఖ్యంగా ఔట్లుక్లో మెయిల్స్ చూసుకునేవారు, టీమ్స్లో ఆన్లైన్ మీటింగ్స్ పెట్టుకునేవారు, 365 యాప్స్తో రోజువారీ ఆఫీస్ పని చేసుకునే ఉద్యోగులు, కంపెనీలు తీవ్ర ఇబ్బంది పడ్డారు. కోపైలట్ లాంటి ఏఐ సేవలు వాడేవారిపైనా దీని ప్రభావం పడింది.

రోజువారీ ఆఫీస్ పనులు, సమాచార మార్పిడి, ఆన్లైన్ సమావేశాలు ఆగిపోవడంతో చాలామంది అసౌకర్యానికి గురయ్యారు. దీనిపై మైక్రోసాఫ్ట్ వినియోగదారులకు క్షమాపణలు చెప్పింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande