
గోవా, 14 నవంబర్ (హి.స.)
ప్రపంచ ప్రసిద్ధి
గాంచిన 57వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (IFFI) ఈ
నెల 20 నుంచి గోవాలో అత్యంత వైభవంగా ప్రారంభంకానుంది. 'సరిహద్దులు లేని కథలు' (Stories Without Borders) ప్రధాన థీమ్‌గా నిర్వహిస్తున్న ఈ వేడుకకు ప్రపంచవ్యాప్తంగా 137 దేశాల నుంచి 1,900కి
పైగా చలనచిత్రాలు ఎంట్రీలు పంపగా...అందులో 86
దేశాలకు చెందిన 150కి పైగా అంతర్జాతీయ
సినిమాలు ప్రదర్శించనున్నారు.గోవాలోని తాజ్ సిడాడే డి గోవా హోరైజన్‌లో
నిర్వహించిన కర్టెన్ రైజర్ మీడియా సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ ప్రమోద్
సావంత్ ఉత్సవ ఏర్పాట్లను, విశేషాలను మీడియాకు వివరించారు.
ఈ చలనచిత్రోత్సవంలో పావెల్ పావ్లికోవ్‌స్కీ
దర్శకత్వం వహించిన 'ఫాదర్లాండ్'
(Fatherland) చిత్రం ఓపెనింగ్ సినిమాగా
ప్రదర్శించబడుతుంది.అలాగే అంథోనీ చెన్ దర్శకత్వం వహించిన 'వీ ఆర్ ఆల్
స్ట్రేంజర్స్' సినిమాతో ఈ వేడుకలు ముగియనున్నాయి.అదినా షెర్బాన్
దర్శకత్వం వహించిన 'ఐ మేటర్' చిత్రం మిడ్-ఫెస్ట్ సినిమాగా ప్రదర్శించనున్నారు.
ఉత్సవంలో ప్రత్యేక ఆకర్షణలు:
- గౌరవ, భాగస్వామ్య
దేశాలు:ఈసారి ఇఫ్ఫీలో 'స్పెయిన్' కంట్రీ
ఆఫ్ ఫోకస్ (గౌరవ దేశం)గా వ్యవహరిస్తుండగా,
'రష్యా' భాగస్వామ్య
దేశంగా (Partner Country) పాలుపంచుకుంటోంది.ఈ దేశాల నుంచి ప్రత్యేక చలనచిత్రాలు ప్రదర్శించబడతాయి.
- కొత్త విభాగాలు:ఈ ఏడాది ఉత్సవాలలో రెండు కొత్త సెగ్మెంట్లు
ప్రారంభించారు.యానిమేషన్ విభాగంలో 5 అత్యుత్తమ
సినిమాలు, అలాగే 'ఫిల్మ్స్ అబౌట్ ఫిల్మ్స్' (Films About Films) పేరుతో మరో ఐదు చిత్రాలు ప్రదర్శిస్తారు.అలాగే 'బ్రిక్స్' (BRICS) దేశాల
సినిమాపై ప్రత్యేక దృష్టి సారించగా,
భారత్‌కు చెందిన 'రామాయణం' చిత్రంతో
ఈ సెగ్మెంట్ ప్రారంభమవుతుంది.
- ఇండియన్ పనోరమ:ఇండియన్ పనోరమ విభాగంలో వివిధ భాషలకు చెందిన మొత్తం 76 సినిమాలు
ప్రదర్శించనున్నారు.హిందీ ఫీచర్ ఫిల్మ్ 'ధురంధర్', లద్దాఖీ
నాన్-ఫీచర్ ఫిల్మ్ 'బికమింగ్'తో ఈ విభాగాలు ప్రారంభమవుతాయి.ఇందులో తెలుగు సినిమా 'చెన్నై లవ్ స్టోరీ' సహా
పలు చిత్రాలు ఉత్తమ డెబ్యూ డైరెక్టర్ కేటగిరీలో నామినేట్ అయ్యాయి.
- ప్రత్యేక వేడుకలు: 'క్రియేటివ్
మైండ్స్ ఆఫ్ టుమారో' ఆరో సంచిక ద్వారా 100
మంది యువ ప్రతిభావంతులకు శిక్షణ, మాస్టర్‌క్లాసులు
నిర్వహించనున్నారు.అలాగే, ప్రముఖ
సినీ దిగ్గజాలు శక్తి సామంత్,
రాజ్ ఖోస్లా, ఉత్తమ్
కుమార్, ఒ.పి.నాయర్, రవి
తదితరుల శతజయంతి ఉత్సవాలను ఈ వేదికపై ఘనంగా నిర్వహించి
నివాళులర్పించనున్నారు.
ఏషియాలోనే అత్యంత పురాతనమైన
చలనచిత్రోత్సవాలలో ఒకటైన ఇఫ్ఫీ...భిన్న సంస్కృతుల మధ్య అనుసంధానకర్తగా
నిలుస్తూ, భారతీయ చిత్రసీమకు ప్రపంచ వేదికపై మరింత గుర్తింపు తెస్తోందని
సమాచార, ప్రసార శాఖ అధికారులు వెల్లడించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi