ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం
ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల సందడి మొదలైంది. ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థుల నుంచి నేటి నుంచి నామినేషన్లను స్వీకరించనున్నారు.
Vote


అమరావతి , 14 నవంబర్ (హి.స.)

ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల సందడి మొదలైంది. ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థుల నుంచి నేటి నుంచి నామినేషన్లను స్వీకరించనున్నారు. ఈ నెల 16వ తేదీ వరకు నామినేషన్ల దాఖలుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. ఇందుకు సంబంధించి అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేపట్టారు.

రాష్ట్రంలోని నాలుగు మున్సిపల్ కార్పొరేషన్లు, 19 మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారైంది. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ పూర్తయిన అనంతరం వాటి పరిశీలన, ఉపసంహరణ వంటి తదుపరి కార్యక్రమాలు కొనసాగనున్నాయి. ఈ నెల 26వ తేదీన పోలింగ్ నిర్వహించనున్నారు. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఎన్నికల అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

అనంతరం ఈ నెల 30వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడించనున్నారు. ఎన్నికల నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో రాజకీయ పార్టీల నేతలు, అభ్యర్థులు ప్రచారానికి సిద్ధమవుతున్నారు. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande