కష్టపడి చదివిన వారికి విజయం..... ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ
జిల్లా పోలీసు శాఖ తరఫున 60 రోజులుగా స్థానిక డీటీసీ ప్రాంగణంలో నడుస్తున్న ఎస్సై, కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షల ఉచిత శిక్షణ శిబిరం శనివారం ముగిసింది.
Sp


ఆదిలాబాద్, 14 నవంబర్ (హి.స.)

జిల్లా పోలీసు శాఖ తరఫున 60 రోజులుగా స్థానిక డీటీసీ ప్రాంగణంలో నడుస్తున్న ఎస్సై, కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షల ఉచిత శిక్షణ శిబిరం శనివారం ముగిసింది.

జిల్లాలోని వేర్వేరు మండలాల నుంచి 300 మందికి పైగా అభ్యర్థులు వచ్చి, అనుభవజ్ఞులైన అధ్యాపకుల దగ్గర శిక్షణ తీసుకున్నారు. ముగింపు కార్యక్రమానికి వచ్చిన ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, పోలీసు ఉద్యోగమే లక్ష్యంగా పెట్టుకుని కష్టపడి చదివి విజయం సాధించాలని పిలుపునిచ్చారు.

ఈ నెల 29న ఎస్సై ప్రిలిమినరీ, డిసెంబర్ 20న కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షలు ఉన్న నేపథ్యంలో, పరీక్షలు అయ్యే వరకు ప్రతి నిమిషాన్ని విలువైనదిగా భావించాలని సూచించారు. సమయాన్ని వృథా చేయకుండా చదువు మీదే దృష్టి పెట్టాలని, తల్లిదండ్రులు, టీచర్లు చెప్పిన మాటలు వింటూ పూర్తిగా సిద్ధం కావాలని చెప్పారు. కష్టపడి చదివిన వారికి విజయం ఖచ్చితంగా వస్తుందని భరోసా ఇచ్చారు. ప్రిలిమినరీ, ఫిజికల్ పరీక్షల్లో పాస్ అయిన వారికి తర్వాతి దశ శిక్షణను ఉచిత భోజనం, వసతితో పాటు అందిస్తామని హామీ ఇచ్చారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande