మహనీయుల సేవలను భావితరాలకు తెలియజేయాలి.. ఎమ్మెల్యే కోవ లక్ష్మి
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండల కేంద్రంలోని గణేశ్ నగర్ లో శనివారం క్రాంతివీర్ లహూజీ సాల్వే 292వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.
MLA


ఆసిఫాబాద్, 14 నవంబర్ (హి.స.)

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండల కేంద్రంలోని గణేశ్ నగర్ లో శనివారం క్రాంతివీర్ లహూజీ సాల్వే 292వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.

ఈ వేడుకల్లో పాల్గొన్న ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి లహూజీ సాల్వే చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ మహనీయుడు లహూజీ సాల్వే చేసిన సేవలు ఎంతో ప్రశంసనీయమైనవని కొనియాడారు.

ఆయన చూపిన బాటలో నడుస్తూ ఆయన ఆశయాలను నెరవేర్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అన్నా భావు సాఠే కమిటీ సభ్యులు కోరిన విధంగా జైనూర్ మండల కేంద్రంలో క్రాంతివీర్ లహూజీ సాల్వే విగ్రహం ఏర్పాటుకు తన వంతు పూర్తి సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.

మహనీయుల సేవలను భావితరాలకు తెలియజేసే విధంగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని, ఈ వేడుకల్లో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఎమ్మెల్యే కోవ లక్ష్మిని ఘనంగా సన్మానించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande