గిగ్ వర్కర్లకు ఆరోగ్య భద్రత కల్పిస్తామనడం పెద్ద జోక్: బండి సంజయ్
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర విమర్శలు చేశారు. ఆయన చేసే ప్రకటనల్లో వాస్తవాల కంటే హామీలే ఎక్కువగా ఉంటాయని ఎద్దేవా చేశారు.
bandi sanjay


హైదరాబాద్ , 14 నవంబర్ (హి.స.)కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర విమర్శలు చేశారు. ఆయన చేసే ప్రకటనల్లో వాస్తవాల కంటే హామీలే ఎక్కువగా ఉంటాయని ఎద్దేవా చేశారు. గిగ్ వర్కర్లకు ఆరోగ్య భద్రత కల్పిస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని వ్యాఖ్యానించారు. కార్మికుల సంక్షేమం గురించి మాట్లాడే ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు తీరును పరిశీలించాలని సూచించారు.

ఎన్నికల సమయంలో రాహుల్గాంధీ ప్రస్తావించిన ఆరు గ్యారంటీలు ఇప్పటికీ పూర్తిస్థాయిలో అమలుకు నోచుకోలేదని బండి సంజయ్ ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కొత్త ప్రకటనలతో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ నేతలు చెప్పే మాటలు ఆచరణలో కనిపించడం లేదని మండిపడ్డారు.

గిగ్ వర్కర్లకు ఆరోగ్య భద్రత, సంక్షేమ పథకాలు అందిస్తామని ప్రకటించడం కేవలం ప్రచారానికే పరిమితమవుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రాహుల్గాంధీ పర్యటన, గిగ్ కార్మికుల సంక్షేమ విధానంపై కాంగ్రెస్ చేస్తున్న ప్రచారాన్ని బండి సంజయ్ తప్పుబట్టారు. ఈ వ్యాఖ్యలతో తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య రాజకీయ విమర్శలు మరింత తీవ్రతరమయ్యాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande