బిజెపి చీఫ్ రామచంద్రరావు హౌస్ అరెస్ట్
హైదరాబాద్లోని హెచ్ఐసీసీలో జరుగుతున్న భారత్ సమ్మిట్ చుట్టూ తెలంగాణలో రాజకీయ వేడి పెరిగింది.
BJP chief


హైదరాబాద్, 14 నవంబర్ (హి.స.)

హైదరాబాద్లోని హెచ్ఐసీసీలో జరుగుతున్న భారత్ సమ్మిట్ చుట్టూ తెలంగాణలో రాజకీయ వేడి పెరిగింది. ఈ సదస్సుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వస్తున్న నేపథ్యంలో, ఆయన పర్యటనకు అడ్డుపడతామని చెప్పిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావును ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు ముందే ఇంట్లోనే నిర్బంధించారు. భారత్ సమ్మిట్ పేరు చెప్పి బయటి దేశాల వారిని పిలిచి దేశం పరువును, ప్రధాని మోదీ ప్రభుత్వాన్ని తక్కువ చేసే పని చేస్తున్నారని రాంచందర్ రావు ఆరోపించారు. ఈ సదస్సుకు వ్యతిరేకంగా రాష్ట్రమంతా బీజేపీ శ్రేణులు నల్ల జెండాలతో నిరసన తెలపాలని పిలుపునిచ్చారు. రైతుల కష్టాలు, నిరుద్యోగుల బాధలు తీర్చడంలో, ఆరు గ్యారంటీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేతులెత్తేసిందని విమర్శించారు. ప్రజల సమస్యలను వదిలేసి రాహుల్ గాంధీ భావాలకు ప్రపంచ స్థాయిలో ప్రచారం ఇచ్చేందుకే ఈ సమ్మిట్ పెడుతున్నారని బీజేపీ నేతలు మండిపడ్డారు. తనను, పార్టీ కార్యకర్తలను ఇంట్లోనే బంధించడాన్ని రాంచందర్ రావు తప్పుపట్టారు. ఇదిలా ఉండగా ఆయన ఇంటికి బీజేపీ నాయకులు, కార్యకర్తలు చేరుకోవడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. రాష్ట్రంలో చాలా చోట్ల బీజేపీ నేతలను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. హెచ్ఐసీసీ చుట్టుపక్కల భారీగా పోలీసులను మోహరించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande