పేదల కష్టసుఖాల్లో తోడుగా నిలవడమే ప్రభుత్వ లక్ష్యం.. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని జూకల్ ఫంక్షన్ హాల్లో శనివారం 533 మంది లబ్ధిదారులకు నూతన చేయూత పింఛన్ మంజూరు పత్రాలను భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అందజేశారు.
Mla


భూపాలపల్లి, 14 నవంబర్ (హి.స.)

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని జూకల్ ఫంక్షన్ హాల్లో శనివారం 533 మంది లబ్ధిదారులకు నూతన చేయూత పింఛన్ మంజూరు పత్రాలను భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల కష్టసుఖాల్లో తోడుగా నిలవడమే ప్రజాపాలన ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చెప్పారు. వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలతో సహా నిరుపేదలందరికీ ప్రభుత్వం భరోసాగా ఉంటుందని తెలిపారు.

ఎలాంటి అవినీతి, అక్రమాలకు ఆస్కారం లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్ అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. సామాజిక భద్రతలో భాగంగా అర్హులైన పేదలకు చేయూత అందించడమే తమ ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande