
హైదరాబాద్ , 14 నవంబర్ (హి.స.)
తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని బీజేపీ, బీఆర్ఎస్ నేతలు వ్యవహరించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచించారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విజ్ఞతతో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని హితవు పలికారు. పెట్టుబడులకు తెలంగాణ అనుకూలంగా ఉందనే విషయాన్ని ప్రపంచానికి తెలియజేయాలనే ఉద్దేశంతోనే భారత్ సమిట్‌ను నిర్వహిస్తున్నట్లు సీఎం స్పష్టం చేశారు. అయితే బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ప్రతి అంశాన్ని గుడ్డిగా వ్యతిరేకిస్తూ రాష్ట్రానికి నష్టం కలిగిస్తున్నాయని విమర్శించారు.
రాహుల్‌గాంధీ పర్యటనపైనా రేవంత్‌రెడ్డి స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఆహ్వానం మేరకే ఆయన తెలంగాణకు వస్తున్నారని తెలిపారు. గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం రూపొందించిన ప్రత్యేక పాలసీని రాహుల్‌గాంధీ ప్రారంభిస్తారని వెల్లడించారు. రాహుల్‌గాంధీని మళ్లీ రాజకీయంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు.
మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసుపై సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో త్వరలోనే ఊహించని పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉందని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం తన ఫోన్‌ను ట్యాప్ చేసినా తనకు ఎలాంటి ఇబ్బంది లేదని, తాను మాట్లాడే ప్రతి విషయం బహిరంగంగానే ఉంటుందని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్