భూదాన్ పోచంపల్లిలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దగ్ధం
భారత్ సమ్మిట్ కోసం హైదరాబాద్కు రాహుల్ గాంధీ వస్తుండటాన్ని వ్యతిరేకిస్తూ భూదాన్ పోచంపల్లిలో బీజేవైఎం కార్యకర్తలు శనివారం ఆందోళనకు దిగారు.
Bjym


నల్గొండ, 14 నవంబర్ (హి.స.)

భారత్ సమ్మిట్ కోసం హైదరాబాద్కు రాహుల్ గాంధీ వస్తుండటాన్ని వ్యతిరేకిస్తూ భూదాన్ పోచంపల్లిలో బీజేవైఎం కార్యకర్తలు శనివారం ఆందోళనకు దిగారు.

స్థానిక నేతాజీ చౌరస్తా దగ్గర ధర్నా చేసి రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా నినాదాలు చేసిన తర్వాత ఆయన దిష్టిబొమ్మను తగలబెట్టారు. అయితే దిష్టిబొమ్మకు ముందే పెట్రోల్ పోసి ఉండటంతో నిప్పు పెట్టగానే మంటలు ఒక్కసారిగా పెద్దగా లేచాయి.

దీంతో అక్కడే డ్యూటీలో ఉన్న ఇద్దరు పోలీసులకు తల, చేతుల వెంట్రుకలు కాలిపోయి చిన్నపాటి గాయాలయ్యాయి. ఈ సందర్భంగా బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు బద్దం వెంకట్ రెడ్డి మాట్లాడుతూ, ఎన్నికల్లో తెలంగాణ యువతకు చెప్పిన 2 లక్షల ఉద్యోగాల మాటను ప్రభుత్వం నిలబెట్టుకోలేకపోయిందని మండిపడ్డారు. జాబ్ క్యాలెండర్ను వెంటనే విడుదల చేయాలని, పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లు, మెస్ చార్జీల బకాయిలను త్వరగా చెల్లించాలని డిమాండ్ చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande