హామీలు అమలు చేయకుండా ఇందిర, రాజీవ్ పేర్లు పెట్టడం సరికాదు: హరీశ్రావు
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా, వాటికి ఇందిరాగాంధీ, రాజీవ్గాంధీ పేర్లు పెట్టడం సమంజసం కాదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావు విమర్శించారు.
harish rao


హైదరాబాద్ , 14 నవంబర్ (హి.స.)

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా, వాటికి ఇందిరాగాంధీ, రాజీవ్గాంధీ పేర్లు పెట్టడం సమంజసం కాదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావు విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చినప్పుడే ఆ మహనీయులకు నిజమైన గౌరవం ఇచ్చినట్లవుతుందని వ్యాఖ్యానించారు. ఈ విషయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ ప్రత్యేకంగా దృష్టి సారించాలని కోరారు.

తెలంగాణలో రేవంత్రెడ్డి ప్రభుత్వం మూడు బడ్జెట్లు ప్రవేశపెట్టినా, ఇప్పటివరకు అనేక హామీలు కార్యరూపం దాల్చలేదని హరీశ్రావు ఆరోపించారు. ప్రభుత్వం అనుసరిస్తున్న మూడు బడ్జెట్ల విధానం ప్రకటనలకే పరిమితమైందని విమర్శించారు. కొత్త పథకాల పేరుతో పాత హామీలనే మళ్లీ ప్రకటిస్తున్నారని, కానీ వాటి ద్వారా ప్రజలకు ఎలాంటి ప్రయోజనం కలగడం లేదని అన్నారు.

రాజకీయ ప్రసంగాలు, నినాదాలకు పరిమితం కాకుండా కాంగ్రెస్ మేనిఫెస్టోలో పేర్కొన్న హామీల అమలుపై రాహుల్గాంధీ సమీక్ష నిర్వహించాలని సూచించారు. ప్రతి హామీ ఎందుకు అమలు కాలేదో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని ప్రశ్నించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో హామీలు ఇవ్వడమే బాధ్యత కాదని, వాటిని అమలు చేసేలా నాయకత్వం చర్యలు తీసుకోవాలని హరీశ్రావు హితవు పలికారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande