గ్రంథాలయ అభివృద్ధికి పూర్తి సహకారం.. ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్
చదువుతోనే అభివృద్ధి సాధ్యమని, పుస్తకాలు చదివితేనే జ్ఞానం పెరుగుతుందని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ చెప్పారు.
Mla


జగిత్యాల, 14 నవంబర్ (హి.స.)

చదువుతోనే అభివృద్ధి సాధ్యమని, పుస్తకాలు చదివితేనే జ్ఞానం పెరుగుతుందని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ చెప్పారు.

శనివారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని జిల్లా గ్రంథాలయంలో పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా జరిగిన 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల కార్యక్రమానికి ఆయన వచ్చారు.

అక్కడ విద్యార్థులతో మాట్లాడుతూ, గ్రంథాలయాలు పిల్లల జ్ఞానాన్ని పెంచడంలో ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. పాఠ్య పుస్తకాలే కాకుండా, విజ్ఞానానికి సంబంధించిన ఇతర పుస్తకాలను కూడా చదివే అలవాటు చేసుకోవాలని సూచించారు. జిల్లా కేంద్రంలో ఎస్సీ, బీసీ స్టడీ సర్కిళ్లు పెట్టేందుకు ప్రయత్నం చేశామని తెలిపారు.

గతంలో పోటీ పరీక్షలకు చదువుకునే గ్రంథాలయ విద్యార్థులు అడగడంతో వారికి భోజన వసతి కూడా ఏర్పాటు చేశామని చెప్పారు. రూ. కోటి ఖర్చుతో గ్రంథాలయ భవనం మంజూరు చేయించామని, దాని నిర్మాణం దాదాపు అయిపోయిందని వివరించారు.

గురుకుల స్కూళ్లలో వసతుల కొరత తీర్చేందుకు రూ. 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాంప్లెక్స్ మంజూరు చేయించి పనులు మొదలుపెట్టామని తెలిపారు. జిల్లా కేంద్రంలోని గ్రంథాలయాన్ని త్వరగా ప్రారంభించేలా గ్రంథాలయ చైర్మన్ చొరవ తీసుకోవాలని కోరారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande