
హైదరాబాద్ , 14 నవంబర్ (హి.స.)రాష్ట్రంలోని రిజిస్టర్ ఫార్మాసిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించేందుకు నేడు ఫార్మసీ సంఘాల ప్రతినిధులు సమావేశం కానున్నారు. ఫార్మసీ రంగంలో పనిచేస్తున్న అర్హత కలిగిన ఫార్మాసిస్టులు వివిధ ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో వారి సమస్యలను సంబంధిత వర్గాల దృష్టికి తీసుకెళ్లేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు.
ఈ భేటీలో ఫార్మాసిస్టుల వృత్తిపరమైన సమస్యలు, ఉద్యోగ అవకాశాలు, విధి నిర్వహణలో ఎదురవుతున్న ఇబ్బందులు, వారి హక్కులు, సంక్షేమానికి సంబంధించిన అంశాలపై చర్చించే అవకాశం ఉంది. రిజిస్టర్ ఫార్మాసిస్టులకు ఎదురవుతున్న సమస్యలకు పరిష్కార మార్గాలను అన్వేషించడంతో పాటు భవిష్యత్తులో చేపట్టాల్సిన కార్యాచరణపై కూడా ప్రతినిధులు అభిప్రాయాలు పంచుకోనున్నారు.
అలాగే ఫార్మసీ రంగంలో నిబంధనల అమలు, ఫార్మాసిస్టులకు తగిన గుర్తింపు, వృత్తిపరమైన భద్రత వంటి అంశాలు సమావేశంలో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. రాష్ట్రవ్యాప్తంగా ఫార్మసిస్టులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను సమగ్రంగా చర్చించి, వాటి పరిష్కారం కోసం ప్రభుత్వానికి వినతులు సమర్పించే అంశంపైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ సమావేశంలో వెలువడే నిర్ణయాలపై ఫార్మసీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్