అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు.. ఎమ్మెల్యే కోరం కనకయ్య
ప్రజా ప్రభుత్వం తెచ్చిన పథకాల గురించి ఇంటింటికీ వెళ్లి చెప్పాలని కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు సూచించారు ఎమ్మెల్యే కోరం కనకయ్య.
MLA


ఇల్లందు, 14 నవంబర్ (హి.స.)

ఇల్లెందులో శనివారం తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే కోరం కనకయ్య, ప్రజా ప్రభుత్వం తెచ్చిన పథకాల గురించి ఇంటింటికీ వెళ్లి చెప్పాలని కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు సూచించారు.

దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలోనే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు నడుస్తున్నాయని ఆయన చెప్పారు. ముఖ్యంగా కుటుంబ బీమా పథకాన్ని చారిత్రాత్మకమైన అడుగుగా అభివర్ణించారు.

ఈ నెల 19న దివంగత మాజీ ప్రధాని జయంతి రోజున కొత్త పింఛన్ డబ్బులు లబ్ధిదారుల ఖాతాల్లో వేయడంతో పాటు, అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి బీమా రక్షణ కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందని వివరించారు. కుల, మతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయంగా లాభం పొందడం తప్ప బీజేపీ ప్రజల కోసం ఏమీ చేయలేదని విమర్శించారు.

సన్న బియ్యం, రైతు రుణమాఫీ, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, ఉచిత కరెంటు, మహిళలకు ఉచిత బస్సు, మహిళా సంఘాలకు వడ్డీ లేని అప్పులు, కొత్త పింఛన్లు వంటివన్నీ ప్రతి గడపకు చేరాలని కోరారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande