ఈ నెల 19న పింఛన్ డబ్బులు జమ.. పెద్దపల్లి ఎమ్మెల్యే
సుల్తానాబాద్లో శనివారం జరిగిన కొత్త పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పెద్దపల్లి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణారావు పాల్గొన్నారు.
Mla


పెద్దపల్లి, 14 నవంబర్ (హి.స.)

సుల్తానాబాద్లో శనివారం జరిగిన కొత్త పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పెద్దపల్లి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణారావు పాల్గొన్నారు.

ఈ సందర్బంగా రైతుల గురించి మాట్లాడారు. రాష్ట్రంలో కరెంట్కు ఎలాంటి ఇబ్బంది లేదని, రైతులకు ఆపకుండా కరెంట్ ఇస్తున్నామని చెప్పారు.

ధాన్యం కొనుగోలు చేసిన రోజు తర్వాత రోజే వారి ఖాతాల్లో డబ్బు వేస్తున్నామని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల కింద ఈ మండలంలోనే దాదాపు 800 మంది ఇల్లు కట్టుకోవడం మొదలుపెట్టారని, ప్రతి ఇంటికి రూ.5 లక్షల చొప్పున సాయం అందిస్తున్నామని వివరించారు.

ఆ తర్వాత పింఛన్ల విషయానికి వస్తే, అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో పేదలు, మహిళలు, చేనేత, గీత కార్మికులకు పెద్దపీట వేస్తున్నామని చెప్పారు.

ఈ సందర్భంగా సుల్తానాబాద్ మున్సిపాలిటీలో 286 మందికి, మండలంలోని 27 పంచాయతీల్లో 755 మందికి కలిపి మొత్తం 1,041 మందికి కొత్త పింఛన్ పత్రాలు అందజేశారు. పింఛన్ రాక ఇబ్బంది పడుతున్న అర్హులు భయపడాల్సిన అవసరం లేదని, మళ్లీ సర్వే చేసి వారికి కూడా ఇప్పిస్తానని భరోసా ఇచ్చారు. నవంబర్ 19న ఇందిరాగాంధీ జయంతి నాడు కొత్త వారి ఖాతాల్లో పింఛన్ డబ్బులు జమ అవుతాయని తెలిపారు. వృద్ధులకు కూడా వచ్చే ఏడాది మార్చి-ఏప్రిల్ నుంచి కొత్త పింఛన్లు ఇవ్వడం మొదలుపెట్టి, మూడు నాలుగు నెలల్లో పూర్తి చేస్తామని చెప్పారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande