ఆటల వల్ల శరీరానికి ఆరోగ్యం మరియు మనసుకి ధైర్యం.. బాల్కొండ ఎమ్మెల్యే
నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి స్టేడియంలో శనివారం 12వ రాష్ట్ర స్థాయి జూనియర్ సాఫ్ట్బాల్ పోటీలను బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు.
Mla


నిజామాబాద్, 14 నవంబర్ (హి.స.)

నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి స్టేడియంలో శనివారం 12వ రాష్ట్ర స్థాయి జూనియర్ సాఫ్ట్బాల్ పోటీలను బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఓటమి వచ్చిందని నిరాశ పడకుండా పట్టుదలతో ప్రాక్టీస్ చేస్తే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకోవచ్చని సూచించారు.

కమ్మర్పల్లిలో రాష్ట్ర స్థాయి టోర్నీ జరగడం బాల్కొండ నియోజకవర్గానికి ఎంతో గర్వంగా ఉందని అన్నారు. మాజీ సీఎం కేసీఆర్ సహకారంతో ఇక్కడ స్టేడియం కట్టడం వల్లే ఇప్పుడు ఇలాంటి పెద్ద పోటీలు నిర్వహించగలుగుతున్నామని చెప్పారు. వచ్చే ఏడాది అన్ని సౌకర్యాలతో జాతీయ స్థాయి పోటీలను ఇక్కడే ఘనంగా జరిపేందుకు పూర్తిగా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. క్రీడాకారుల భవిష్యత్తు కోసం కేసీఆర్ చదువులో, ప్రభుత్వ ఉద్యోగాల్లో 2 శాతం రిజర్వేషన్ పెట్టి, దాని కోసం ప్రత్యేకంగా చట్టం చేసి జీవో కూడా ఇచ్చారని గుర్తుచేశారు. ఆటలు ఆడటం వల్ల శరీరానికి ఆరోగ్యంతో పాటు మనసుకు ధైర్యం వస్తుందని, గెలుపు, ఓటమిని ఒకేలా తీసుకునే తత్వం క్రీడల వల్లే అలవడుతుందని తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande