హైదరాబాద్కు రాహుల్ గాంధీ.. గిగ్ వర్కర్ల ర్యాలీ, బహిరంగ సభలో పాల్గొననున్న నేత
కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అర్ధరాత్రి ఒంటి గంటకు హైదరాబాద్కు చేరుకోనున్నారు.
49 Gujarat Youth Congress office bearers suspended for missing Rahul Gandhi's Delhi rally


అమరావతి , 14 నవంబర్ (హి.స.)కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అర్ధరాత్రి ఒంటి గంటకు హైదరాబాద్కు చేరుకున్నారు . ఈరోజు నగరంలో నిర్వహించనున్న గిగ్ వర్కర్ల ర్యాలీ, బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను కాంగ్రెస్ నాయకులు ఇప్పటికే సిద్ధం చేసారు .

హైదరాబాద్లోని శిల్పకళావేదిక నుంచి హెచ్ఐసీసీ వరకు గిగ్ వర్కర్లతో భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. అనంతరం హెచ్ఐసీసీ సమీపంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రాహుల్ గాంధీ పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో గిగ్ వర్కర్లు హాజరయ్యేలా నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ పర్యటనలో భాగంగా రాహుల్ గాంధీ గిగ్ వర్కర్లతో నేరుగా మాట్లాడనున్నారు. ఆన్లైన్ డెలివరీ, క్యాబ్ సేవలు తదితర రంగాల్లో పనిచేస్తున్న కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, వారి పని పరిస్థితులు, ఉపాధి భద్రత వంటి అంశాలపై వారి అభిప్రాయాలను తెలుసుకోనున్నారు.

మరోవైపు గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం రూపొందించిన కొత్త నిబంధనలను ఈ కార్యక్రమంలో ప్రారంభించనున్నారు. రాహుల్ గాంధీ చేతుల మీదుగా కార్మికుల సంక్షేమ పథకాలు ప్రారంభం కానున్నాయి. ఈ పర్యటనతో గిగ్ వర్కర్ల సమస్యలు, సంక్షేమ అంశాలకు ప్రాధాన్యం లభించనుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande