
హైదరాబాద్ , 14 నవంబర్ (హి.స.)
కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాంధీ విదేశీ ప్రతినిధులతో వరుస సమావేశాలు నిర్వహించారు. లాటిన్ అమెరికా, ఆఫ్రికా, ఆసియా దేశాలకు చెందిన నేతలతో ఆయన ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అలాగే అమెరికా, యూరప్‌కు చెందిన ప్రతినిధులతోనూ సమావేశమై వివిధ అంశాలపై చర్చించినట్లు సమాచారం. అంతర్జాతీయ సంబంధాలు, ప్రజాస్వామ్య విలువలు, సామాజిక అభివృద్ధి వంటి అంశాలు ఈ భేటీల్లో ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది.
మరోవైపు, రాహుల్‌గాంధీ త్వరలో హైదరాబాద్‌లోని జయభేరి గ్రౌండ్స్‌కు చేరుకోనున్నారు. అక్కడ తెలంగాణ ప్రభుత్వం గిగ్ వర్కర్ల కోసం ప్రవేశపెట్టనున్న సామాజిక భద్రత పథకానికి సంబంధించిన కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. ఆన్లైన్ డెలివరీ, రవాణా తదితర రంగాల్లో పనిచేస్తున్న గిగ్ కార్మికులకు భద్రత కల్పించడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశం. అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులకు సంక్షేమ ప్రయోజనాలు అందించేందుకు ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపడుతోంది. ఈ కార్యక్రమం ద్వారా గిగ్ వర్కర్ల సంక్షేమానికి సంబంధించి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించనున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్