రాప్తాడు బాలికపై దాడి కేసు నిందితుడు హేమంత్కు తీవ్ర అస్వస్థత
అనంతపురం జిల్లాలోని రాప్తాడులో బాలికపై దాడికి పాల్పడిన కేసులో నిందితుడిగా ఉన్న హేమంత్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు.
రాప్తాడు బాలికపై దాడి కేసు నిందితుడు హేమంత్కు తీవ్ర అస్వస్థత


అమరావతి , 14 నవంబర్ (హి.స.)

అనంతపురం జిల్లాలోని రాప్తాడులో బాలికపై దాడికి పాల్పడిన కేసులో నిందితుడిగా ఉన్న హేమంత్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. అతడి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో వైద్యుల సూచన మేరకు అధికారులు మెరుగైన చికిత్స కోసం కర్నూలు ఆస్పత్రికి తరలించారు.

హేమంత్ ప్రస్తుతం పల్మనరీ ఎంబాలిజం సమస్యతో బాధపడుతున్నట్లు వైద్యులు గుర్తించారు. రెండు రోజుల క్రితం అతడికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తినట్లు సమాచారం. దీంతో అనంతపురం ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్న వైద్యులు అతడి ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించారు. గత 13 రోజులుగా హేమంత్ అనంతపురం ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నాడు.

అయితే తాజాగా అతడి ఆరోగ్య పరిస్థితిలో మార్పులు రావడంతో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కర్నూలుకు తరలించాలని నిర్ణయించారు. అధికారుల పర్యవేక్షణలో ఆస్పత్రికి తరలింపు ప్రక్రియ చేపట్టారు. ప్రస్తుతం వైద్యులు అతడికి అవసరమైన చికిత్స అందిస్తున్నారు. రాప్తాడు బాలికపై దాడి ఘటన అప్పట్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande