
నిర్మల్, 14 నవంబర్ (హి.స.)
నిర్మల్ జిల్లా సోపీనగర్లో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న ఓ కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
మంటలు వేగంగా వ్యాపించడంతో కారులో ఉన్న వ్యక్తి బయటకు రాలేక సజీవ దహనమయ్యాడు. మంటలు భారీగా ఎగసిపడటంతో స్థానికులు అతడిని కాపాడేందుకు ప్రయత్నించినా సాధ్యం కాలేదు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. పోలీసులు అక్కడికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..