ఎల్నినో ప్రభావం.. ఆరోగ్య సంక్షోభంపై WHO హెచ్చరిక.. ప్రధాని మోదీతో రేవంత్ భేటీ
ఎల్నినో ప్రభావంతో భారత్లో రానున్న రోజుల్లో తీవ్ర వాతావరణ, ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) హెచ్చరించింది .
Telangana CM Revanth Reddy


హైదరాబాద్ , 14 నవంబర్ (హి.స.)ఎల్నినో ప్రభావంతో భారత్లో రానున్న రోజుల్లో తీవ్ర వాతావరణ, ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) హెచ్చరించింది . 2027 సెప్టెంబర్ వరకు ఎల్నినో ప్రభావం కొనసాగవచ్చని, సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదై ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. దీంతో డీహైడ్రేషన్, వడదెబ్బతో పాటు డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంది. గుండె, కిడ్నీ, శ్వాసకోశ సమస్యలతో బాధపడేవారికి ముప్పు ఎక్కువగా ఉంటుందని హెచ్చరికలు వెలువడుతున్నాయి.

మరోవైపు దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరింది. సగటు వాయు నాణ్యత సూచీ (AQI) 348గా నమోదైంది. కొన్ని ప్రాంతాల్లో 429 పాయింట్లకు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాలుష్య నియంత్రణకు పలు ఆంక్షలు విధించడంతో పాటు పాఠశాలలకు ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తున్నారు.

ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. ప్రధాని మోదీతో భేటీ అయి ఖేలో ఇండియా కార్యక్రమానికి ఆహ్వానించనున్నారు. ఎల్నినో ప్రభావం, కరువు పరిస్థితులు, సాగునీరు, రైతుల సమస్యలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లనున్నారు. రాష్ట్రానికి రూ.30 వేల కోట్ల తక్షణ ఆర్థిక సాయం అందించాలని కొరింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande