అస్సాం కాజీరంగా రోడ్డు ప్రమాదంలో 26కు పెరిగిన మృతుల సంఖ్య: 23 మంది గుర్తింపు, నేడు ఘటనా స్థలానికి సీఎం
అస్సాం కాజీరంగా రోడ్డు ప్రమాదంలో 26కు పెరిగిన మృతుల సంఖ్య: 23 మంది గుర్తింపు, నేడు ఘటనా స్థలానికి సీఎం
accident


గౌహతి, , 14 నవంబర్ (హి.స.)

అస్సాం రాష్ట్రంలోని గోలాఘాట్ జిల్లా కాజీరంగా జాతీయ ఉద్యానవనం సమీపంలో శుక్రవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య 26కు చేరుకుంది.ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారిలో మరికొందరు మరణించడంతో విషాదం మరింత తీవ్రమైంది.ఇప్పటివరకు మరణించిన వారిలో 23 మందిని అధికారులు గుర్తించగా, మిగిలిన ముగ్గురి వివరాలు సేకరిస్తున్నారు.ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మరో 20 మంది బోకాఖాట్ సివిల్ ఆసుపత్రి, జోర్హాట్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

కోహోరా రేంజ్‌లోని హతికులి తేయాకు తోట సమీపంలో రంగాజన్ వద్ద జాతీయ రహదారి-715పై శుక్రవారం మధ్యాహ్నం ఈ దుర్ఘటన జరిగింది.గోలాఘాట్ నుంచి నాగావ్ వైపు వెళ్తున్న ప్రైవేట్ మినీ బస్సు (ట్రావెలర్), ఎదురుగా తేజ్‌పూర్ నుంచి దిబ్రూగఢ్ వెళ్తున్న భారీ కంటైనర్ ట్రక్కును బలంగా ఢీకొట్టింది.మినీ బస్సు అతివేగంతో ప్రయాణించి అకస్మాత్తుగా లేన్ మారడమే ప్రమాదానికి ప్రధాన కారణమని ట్రక్కు డ్యాష్‌క్యామ్ దృశ్యాల ద్వారా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.మృతులలో కళాశాల తరగతులు ముగించుకుని ఇళ్లకు తిరిగి వెళ్తున్న విద్యార్థులు, మహిళలు, చిన్నారులు ఎక్కువగా ఉన్నారు.

ఘటనా స్థలంలో రాష్ట్ర మంత్రులు అతుల్ బోరా, రనోజ్ పెగు సహాయక చర్యలను పర్యవేక్షిస్తుండగా, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ శనివారం ప్రమాద స్థలాన్ని సందర్శించి బాధితులను పరామర్శించనున్నారు.ఈ దుర్ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande