
మైసూరు, 14 నవంబర్ (హి.స.)
భారతదేశ
అంతరిక్ష విజ్ఞాన రంగంలో మరో చారిత్రక మైలురాయి ఆవిష్కృతమైంది.కర్ణాటక పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి
నరేంద్ర మోదీ శనివారం మైసూరులో ప్రపంచంలోనే తొలిసారిగా నిర్మించిన టిల్టెడ్ ఎల్ఈడీ
ప్లానిటోరియం 'కాస్మోస్' (Cosmos)ను ఘనంగా ప్రారంభించారు.ఆర్యభట్ట ఉపగ్రహ ప్రయోగం నుంచి సూర్యుడి
రహస్యాలను ఛేదించేందుకు ఇస్రో చేపట్టిన ప్రతిష్టాత్మక 'ఆదిత్య-ఎల్1' మిషన్ వరకు భారతదేశ అంతరిక్ష ప్రయాణ
అద్భుతాలను ఈ అత్యాధునిక ప్లానిటోరియం కళ్లకు కట్టనుంది.సాంకేతికత మరియు ఖగోళ శాస్త్ర
విజ్ఞానాన్ని అద్భుతంగా మేళవిస్తూ నిర్మించిన ఈ కేంద్రం దేశవ్యాప్తంగా ఉన్న
విద్యార్థులు, శాస్త్రవేత్తలు, ఖగోళ ప్రేమికులకు సరికొత్త అనుభూతిని
పంచనుంది.
ఈ
సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ...ప్రాచీన కాలం నుంచి భారత్ ఖగోళ
శాస్త్రంలో సాధించిన ఘన చరిత్రను, ఆధునిక కాలంలో ఇస్రో
శాస్త్రవేత్తలు సాధిస్తున్న ప్రపంచ స్థాయి ప్రగతిని కొనియాడారు.సాంప్రదాయ ప్రొజెక్షన్ ప్లానిటోరియంలకు
భిన్నంగా, అత్యాధునిక టిల్టెడ్
ఎల్ఈడీ (Tilted LED) స్క్రీన్ టెక్నాలజీతో
దీనిని రూపుదిద్దడం విశేషం.దీనివల్ల సందర్శకులు
అంతరిక్షంలో నేరుగా విహరిస్తున్న అనుభూతిని పొందుతూ గ్రహాలు, నక్షత్రాలు, గెలాక్సీల చలనాన్ని అత్యంత స్పష్టంగా, వాస్తవిక రీతిలో వీక్షించవచ్చు.శాస్త్ర విజ్ఞానం పట్ల యువతలో ఆసక్తిని
పెంపొందించడానికి, ముఖ్యంగా
విద్యార్థులకు అంతరిక్ష రహస్యాలను సులభంగా అర్థమయ్యేలా చేయడానికి ఈ ప్లానిటోరియం
ఎంతగానో ఉపయోగపడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.కర్ణాటక రాష్ట్ర ప్రముఖులు, శాస్త్రవేత్తలు ఈ ప్రారంభోత్సవ
కార్యక్రమంలో పాల్గొని అంతరిక్ష ప్రదర్శనలను తిలకించారు.భారత అంతరిక్ష పరిశోధనా రంగంలో సరికొత్త
అధ్యాయానికి వేదికైన ఈ 'కాస్మోస్' ప్లానిటోరియం దేశ విజ్ఞాన పటంలో ప్రముఖ
స్థానం సంపాదించుకోనుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi