ఢిల్లీకి బయల్దేరిన సీఎం రేవంత్రెడ్డి.. నేడు ప్రధాని మోదీతో కీలక భేటీ
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఢిల్లీ పర్యటనకు బయల్దేరారు. ఈ పర్యటనలో భాగంగా నేడు మధ్యాహ్నం 12 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఆయన సమావేశం కానున్నారు.
Telangana CM Revanth Reddy


హైదరాబాద్ , 15 నవంబర్ (హి.స.)తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఢిల్లీ పర్యటనకు బయల్దేరారు. ఈ పర్యటనలో భాగంగా నేడు మధ్యాహ్నం 12 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఆయన సమావేశం కానున్నారు. రాష్ట్ర మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డితో కలిసి ప్రధానిని కలవనున్నారు. ఈ భేటీలో తెలంగాణకు సంబంధించిన పలు కీలక అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లాలని సీఎం భావిస్తున్నారు.

ప్రధానంగా రాష్ట్ర అభివృద్ధి, ఆర్థిక అవసరాలపై చర్చించడంతో పాటు తెలంగాణకు రూ.30 వేల కోట్ల ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ మంజూరు చేయాలని రేవంత్రెడ్డి కోరనున్నట్లు సమాచారం. రాష్ట్రంలో ఎల్నినో ప్రభావంతో ఏర్పడే వాతావరణ పరిస్థితులు, వర్షాభావం, కరువు ముప్పు వంటి అంశాలను ప్రధానికి వివరించనున్నారు. వ్యవసాయ రంగంపై ప్రతికూల ప్రభావం పడకుండా కేంద్రం సహకారం అందించాలని విజ్ఞప్తి చేయనున్నారు.

అలాగే సాగునీటి ప్రాజెక్టులు, నీటి కేటాయింపులు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై కూడా ప్రధానితో చర్చించే అవకాశం ఉంది. రాష్ట్రానికి అవసరమైన నిధులు, కేంద్రం నుంచి అందాల్సిన సహకారంపై సీఎం తన ప్రతిపాదనలు వివరించనున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande