పూసుకుంట గిరిజనులతో కలిసి పుట్టినరోజు జరుపుకున్న మంత్రి తుమ్మల
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలోని పూసుకుంట గ్రామంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటించారు.
Minister Tummala


హైదరాబాద్ , 15 నవంబర్ (హి.స.)భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలోని పూసుకుంట గ్రామంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటించారు. తన పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేకంగా ఈ గ్రామానికి చేరుకున్న ఆయన గిరిజనులతో కలిసి వేడుకలు జరుపుకున్నారు. స్థానిక ప్రజల మధ్య కేక్ కట్ చేసి వారితో ఆత్మీయంగా గడిపారు.

అనంతరం గ్రామంలోని అర్హులైన లబ్ధిదారులకు పింఛన్లు, రేషన్ కార్డులను మంత్రి పంపిణీ చేశారు. విద్యార్థులకు అవసరమైన యూనిఫామ్స్ అందజేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు గిరిజన కుటుంబాలకు చేరేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు.

గతంలో తాను దత్తత తీసుకున్న పూసుకుంట గ్రామ అభివృద్ధిపై మంత్రి ప్రత్యేకంగా దృష్టి సారించారు. గ్రామంలో ఇప్పటివరకు చేపట్టిన పనులు, ఇంకా పరిష్కరించాల్సిన సమస్యలు, మౌలిక సదుపాయాల కల్పనపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. గిరిజనులకు మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande