
హైదరాబాద్ , 15 నవంబర్ (హి.స.)
తెలంగాణ కాంగ్రెస్, బీజేపీ నాయకుల తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో కీలక పదవుల్లో ఉన్న నేతలు తమ హోదాకు తగినట్లుగా వ్యవహరించడం లేదని విమర్శించారు. అధికారంలో ఉన్న నాయకులు ఇతర పార్టీల జాతీయ నేతల ముందు వ్యవహరిస్తున్న తీరును ఆయన తప్పుబట్టారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాహుల్‌గాంధీ కుటుంబానికి బాడీగార్డుగా మారిపోయారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. రాహుల్‌గాంధీ బైక్‌పై వెళ్తుంటే రాష్ట్ర మంత్రులు, పీసీసీ అధ్యక్షుడు ఆయన వెంట పరుగులు తీయడం ఏమిటని ప్రశ్నించారు. ప్రజలు ఎన్నుకున్న పదవుల్లో ఉన్నవారు ఇలా వ్యవహరించడం తెలంగాణ ఆత్మగౌరవానికి విరుద్ధమని వ్యాఖ్యానించారు.
మరోవైపు కేంద్ర మంత్రి బండి సంజయ్‌పైనా కేటీఆర్ విమర్శలు గుప్పించారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా చెప్పులు మోసే స్థాయికి ఆయన దిగజారారని ఆరోపించారు.
తెలంగాణ గడ్డకు ఆత్మగౌరవమే పునాది అని కేటీఆర్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలు ఆత్మగౌరవానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తారని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులకు ఆత్మగౌరవం విలువ తెలియడం లేదంటూ విమర్శించారు. రాజకీయ పదవుల కంటే ప్రజల గౌరవాన్ని కాపాడుకోవడమే ముఖ్యమని వ్యాఖ్యానించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్