
హైదరాబాద్ , 15 నవంబర్ (హి.స.)
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లనున్నారు. ముఖ్యంగా తెలంగాణలో డిసెంబర్లో నిర్వహించనున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సుకు హాజరుకావాలని మోదీని సీఎం ఆహ్వానించనున్నారు.
అలాగే రాష్ట్రంలో నిర్వహించనున్న ఖేలో ఇండియా యూత్ క్రీడాపోటీల ప్రారంభోత్సవానికి కూడా ప్రధానిని ఆహ్వానించనున్నారు. ఈ రెండు ప్రతిష్ఠాత్మక కార్యక్రమాలకు ప్రధాని హాజరైతే రాష్ట్రానికి మరింత గుర్తింపు లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.
ఈ సందర్భంగా తెలంగాణ అభివృద్ధికి సంబంధించి కేంద్రం నుంచి రావాల్సిన సహకారం, పెండింగ్లో ఉన్న పలు అంశాలపై రేవంత్రెడ్డి ప్రధానితో చర్చించనున్నారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ సమస్యలను ప్రస్తావిస్తూ వినతిపత్రాలు సమర్పించనున్నట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలను మరింత వేగవంతం చేయడమే లక్ష్యంగా ఈ సమావేశం జరగనుంది.
ప్రధానితో సీఎం భేటీ కావడం రాష్ట్ర రాజకీయ, పరిపాలనా వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశంలో చర్చించిన అంశాలు, కేంద్రం నుంచి లభించే స్పందనపై ఆసక్తి నెలకొంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్